Nandamuri Kalyanchakravarthy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అలాంటి నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, హరికృష్ణ జనరేషన్ కి చెందిన మరో హీరో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసి చివరికి తెరమరుగయ్యారు. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..
నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో కళ్యాణ్ చక్రవర్తి. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు అయిన త్రివిక్రమ్ రావు కి పెద్ద కుమారుడు. తండ్రి త్రివిక్రమ్ రావు ప్రొడ్యూసర్ గా పని చేసేవారు. అప్పట్లో ఎన్టీఆర్ త్రివిక్రమ రావు కలిసే ఉండడంతో ఎన్టీఆర్ కొడుకులతో సమానంగా కళ్యాణ్ చక్రవర్తి పెరిగారు. ఇక పెద్దనాన్న ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగిన కళ్యాణ్ చక్రవర్తి నటనపై ఆసక్తి పెంచుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత చెన్నై అకాడమీలో శిక్షణ తీసుకొని, బయట సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.
Advertisement
also read:టైగర్ 3లో సల్మాన్, షారుక్ ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?
Advertisement
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా 1986లో అత్తగారు స్వాగతం సినిమాలో హీరోగా చేశాడు. షూటింగ్ మధ్యలోకి రాగానే కళ్యాణ్ చక్రవర్తి బ్యాగ్రౌండ్ తెలిసింది. అయినా ఆయన సదాసీదా తనానికి అందరూ మెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మామ కోడలు,తలంబ్రాలు, లంకేశ్వరుడు,అత్తగారు జిందాబాద్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. కెరియర్ మంచి పీక్స్ లో ఉండగానే కళ్యాణ్ చక్రవర్తి తండ్రి త్రివిక్రమ్ రావు పక్షవాతంతో మంచాన పడడంతో తండ్రి బాగోగులు చూసుకుంటూ, కొన్ని ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కబీర్ దాస్ సినిమాలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇంతలోనే మేనమామ సినిమా ఆఫర్ రావడంతో ఆ సినిమా చేస్తున్న సమయంలోనే మరో విషాదం జరిగింది.
also read:దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య గురించి మీకు తెలుసా ? సెట్ లోనే సెలబ్రేషన్స్..!
చక్రవర్తి తమ్ముడు భార్యతో వచ్చిన గొడవల కారణంగా సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మనస్థాపానికి గురైన చక్రవర్తి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈ ఘటన నుంచి బయటకు రాకముందే చక్రవర్తి కొడుకు పృద్వి చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇక పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఈ ఘటన మరువకముందే పెదనాన్న నందమూరి తారకరామారావు మరణించడంతో ఇక ఆయన పూర్తిగా సినిమాలకు స్వస్తి పలికి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. తన తండ్రికి ఎన్టీఆర్ చనిపోయిన విషయాన్ని చెప్పకుండా ఆయన ఆరోగ్యం సెట్ అయ్యేవరకు ఆగాడు. రెండేళ్ల తర్వాత తన తండ్రికి ఎన్టీఆర్ మరణ వార్త తెలిసి కొన్ని గంటలకే మరణించాడు. ఈ విధంగా తన కుటుంబం కోసం తన కెరీర్నే త్యాగం చేసిన ఈ హీరో గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.
also read:Title: బాలయ్య బోయపాటి సినిమా స్టోరీ లీక్… నేట్టింట వైరల్..!