టాలెంట్ ఉండాలి కానీ జీవితంలో ఏదో ఒక అవకాశం తప్పనిసరిగా వస్తుంది. వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా వినియోగించుకున్నప్పుడే జీవితంలో ముందడుగు వేయగలం. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బలగం మూవీ ఎంతోమందికి జీవితాన్నిచ్చిందని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే బలగం మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మొగిలయ్య పాట ఎంతో ఫేమస్ అయింది. అలాంటి మొగిలయ్య గురించి కొన్ని విషయాలు చూద్దాం..
also read:మోహన్ బాబు స్నేహితుడు రజినీకాంత్ కి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు.. కారణం అదేనా ?
Advertisement
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం దళిత బంధు ప్రకటించింది. ఈ పథకాన్ని మంజూరు చేస్తూ కలెక్టర్ ప్రావిణ్యకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదలై ప్రేక్షకులు ఆదరణ పొందిన బలగం సినిమాలో మొగిలయ్య పాట పాడి ప్రజల హృదయాలను కదిలించిన విషయం అందరికీ తెలిసిందే.
Advertisement
also read:అందుకే విడాకులను కూడా ఫోటో షూట్ చేసుకున్న… నటి కన్నీటి కథ..!
ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మొగిలయ్య దంపతులను పిలిపించుకొని వారికి దళిత బంధు పథకం మంజూరైన విషయాన్ని తెలియజేశారు . ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్యకు ఉచిత వైద్యంతో పాటు దళిత బంధు పథకాన్ని మంజూరు చేసినందుకు మొగిలయ్య దంపతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.
also read:ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..దిల్ రాజు ద్వారా ఆ సినిమా రీరిలీజ్..!