Home » విడాకుల ఫోటోషూట్.. ఆనందంతో గంతేస్తున్న నటి.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు..!!

విడాకుల ఫోటోషూట్.. ఆనందంతో గంతేస్తున్న నటి.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు..!!

by Sravanthi
Ad

పెళ్లి రెండు మనసులు కలిసి జీవితకాలం జీవించాలని అనుకొని ఓకే తాటిపై నడిచే ఇద్దరు మనుషుల యొక్క జీవితం. అలాంటి పెళ్లిపై భార్యాభర్తలు ఇద్దరూ అనేక అంచనాలు పెట్టుకుంటారు. కానీ పెళ్లి తర్వాత ఒక్కోసారి అంచనాలు తారుమరై విడాకుల వరకు దారితీస్తుంది. ఆ విధంగానే ఈ నటి జీవితంలో కూడా పెళ్లి శాపంగా మారింది. చేసుకున్నందుకు దెబ్బలు తిన్నది. నాలుగేళ్ల నరకానికి స్వస్తి పలికి విడాకులు తీసుకుంది. విడాకులు మంజూరు అవడంతో సంతోష సమయాన్ని ఫోటోషూట్ తో ఎంజాయ్ చేసింది.. మరి పూర్తి వివరాలు ఏంటో చూద్దామా..

also read:చైతన్య చనిపోవడానికి కారణం అప్పులు కాదు.. ఫ్రెండ్ శ్రీరామ్ ఏం చెప్పాడంటే ?

Advertisement

ప్రముఖ తమిళనటి శాలిని మాట్లాడుతూ దుబాయ్ లో ఉంటున్నాను.. నేను దుబాయ్ లో ఉంటున్నానని నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. దుబాయ్ లో నా భర్త నన్ను కొట్టినప్పుడు పార్కింగ్లో వచ్చి పడుకునే దాన్ని, ఎందుకంటే ఆ గొడవను అంతటితో ఆపివేయాలని, ఏం చేయాలో తెలియదు అక్కడ పోలీసుల దగ్గరికి వెళ్తే అతని జీవితం నాశనం అవుతుంది. అందుకే నేను అడ్జస్ట్ అయి కింద పార్కింగ్ లోనే పడుకునే దాన్ని, తెల్లవారిన తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

also read:ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో అల్లరి నరేష్ కి ఫస్ట్ మాస్ హిట్.. ఉగ్రంకి పాజిటివ్..!

2019 వరకు నాలుగేళ్లు అతనితో దెబ్బలు తిన్నాను. నేను ఇన్ని సంవత్సరాలు తిన్న దెబ్బలు ఆరోజు తిరిగి ఇచ్చాను. తిరిగి దెబ్బకు దెబ్బ కొట్టాను. నేను ఇన్ని రోజులు నా పిల్లల కోసం మర్యాద ఇస్తూ వచ్చాను. ఎప్పుడైతే నా పిల్లలు ఏడుస్తున్న కానీ నన్ను కొట్టారో ఇక ఇలాంటి తండ్రి వాళ్లకు అవసరం లేదనిపించింది. అతన్ని తిరిగి కొట్టాను. నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అన్నాడు. నేను ఒంటరిని కాదు నేను ఎందుకు వెళ్ళిపోతాను నువ్వే బయటకు వెళ్లిపో అంటూ తెగేసి చెప్పానని తన కన్నీటి కథను చెప్పుకొచ్చింది శాలిని. ఆ తర్వాత విడాకులు తీసుకున్నానని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె విడాకులు తీసుకున్న ఆనందాన్ని ఫోటోషూట్ చేసుకుంది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు.

also read:లేడీ గెటప్స్ లో కూడా అద్భుతంగా నటించిన హీరోలు..ఎవరంటే..?

Visitors Are Also Reading