సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు చాలా కష్టపడి ఎదిగిన వారే. వారి నిజ జీవితంలోకి వెళ్తే ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకోక మానరు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ మహేష్ అంటే తెలియని వారు ఉండరు. ఇంకా గుర్తుపట్టాలి అంటే రంగస్థలం నటుడు మహేష్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. అలాంటి ఆయన ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి పలు కన్నీరు పెట్టించే విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
also read:
Advertisement
ఓ రోజు నేను నితిన్ గారి ఆఫీసులో ఫోటోలిచ్చి అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఆ సమయంలోనే మా నాన్నగారు చనిపోయారనే ఫోన్ కాల్ వచ్చిందని అన్నారు. అప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని తెలియజేశారు. మా నాన్నను కాటి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ తగలబెట్టే కట్టెలకు కనీసం పుల్లలకు కూడా 500 రూపాయల నా దగ్గర లేవని రంగస్థలం నటుడు మహేష్ తెలియజేశారు. తండ్రి గురించి చెబుతూ మహేష్ ఎమోషనల్ అయ్యారు.
Advertisement
also read:శరత్ బాబు చనిపోలేదు.. చికిత్స జరుగుతుంది శరత్ బాబు సోదరి..!!
ఆ సమయంలో ఎందుకురా ఈ బ్రతుకు అని అనిపించిందని , అప్పుడు నా దగ్గర ఉన్న మా బంధువులు కూడా నన్ను తిట్టారని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జీరో అని, కానీ ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అయినా మన కెరియర్ కి ప్లస్ అవుతుందని మహేష్ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నాగ అశ్విన్ గారి బ్యానర్లో ఉన్న ప్రతి సినిమాలో ఛాన్స్ ఇచ్చారని తెలియజేశారు. ఆయన ఎప్పుడూ న్యాచురల్ గా ఉండాలని కోరుకుంటారని, ప్రస్తుతం జీవితం సాఫీగా కొనసాగుతుందని అన్నారు.
also read:దర్శకుడు శంకర్ నటించిన సినిమాలు ఏవో మీకు తెలుసా ?