Home » దర్శకుడు శంకర్ నటించిన సినిమాలు ఏవో మీకు తెలుసా ?

దర్శకుడు శంకర్ నటించిన సినిమాలు ఏవో మీకు తెలుసా ?

by Anji
Ad

తమిళ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శంకర్ ఎవ్వరూ ఊహించని సబ్జెక్ట్ తో సినిమాలు తీస్తూ.. సూపర్ క్రేజీ దర్శకుడు అని ఈయనకు పేరుంది. ఆయన తీసిన ఏ సినిమా కూాడా తీయడానికీ చాలా మంది దర్శకులు భయపడుతుంటారంటేనే అర్థం చేసుకోవచ్చు.

Advertisement

ఒకనొక సందర్భంలో రాజమౌళి కూడా కొన్ని సీన్లను శంకర్ ఎలా తీశాడో ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. తాజాగా రాజమౌలి పాన్ ఇండియా సినిమా తీసి సౌత్ సత్తాను అందరికీ పరిచయం చేశాడు. అంతకన్న ముందే దర్శకుడు శంకర్ చాలా సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో డబ్ చేశాడు. 

Also Read :   విడిపోయిన తర్వాత మళ్లీ దగ్గర కాను.. వైరల్ అవుతున్న చైతు కామెంట్స్..!!

దాదాపు 59 ఏళ్ల శంకర్ సినీ ఇండస్ట్రీకి నటుడు అవ్వాలని వచ్చాడట. చాలా ఏళ్ల తరువాత నటన తన పని కాదని అర్థం అయిన తరువాత ఎస్.ఏ. చంద్రశేఖర్, పవిత్రన్ వంటి వారి వద్ద దర్శకత్వం డిపార్టుమెంట్ లో చేరాడు. దాదాపు మూడేళ్ల తరువాత జెంటిల్ మెన్ అనే సినిమా కథను రెడీ చేసుకొని అర్జున్ హీరోగా తీశాడు. ఆ మూవీ సౌత్ ఇండియాలోనే సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా మళ్లీ వెనక్కీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దర్శకుడిగా మారడానికి ముందు శంకర్ నటించిన కొన్ని సినిమాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. 

Advertisement

Also Read :  అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

Manam News

మొట్ట మొదటి సారి1985లో ‘వేషం’ అనే మూవీ ద్వారా శంకర్ కెమెరా ముందు కనిపించాడు. ఇక ఆ తరువాత 1986లో పూవుమ్ పూయలం, ‘వసంత రాగం’ అనే చిత్రాల్లో కనిపించారు. అయినా ఒక్క డైలాగ్ కూడా పడలేదు. అసలు ఆ సినిమాలలో శంకర్ ఎప్పుడు వచ్చారో ఎప్పుడు కనిపిస్తారో కూడా చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. ఆ తరువాత నాలుగు సంవత్సరాలకు ‘సీత’ అనే చిత్రంలో జపాన్ అనే పాత్రలో కనిపించాడు. శంకర్, కధలన్ అనే మూవీలో ఓ పాటకు లిరిక్స్ రాసి మరోపాటలో కనిపించాడు. 1994లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ మూవీ తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. శంకర్ దర్శకత్వం వహించిన కాదల్ వైరస్, శివాజీ, ఏంథిరన్ (రోబో), త్రీ ఇడీయట్స్ వంటి సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్ లో 2012లో చివరిసారి స్క్రీన్ పైన కనిపించిన శంకర్ పదేళ్లుగా ఎప్పుడుమళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్స్ , కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీస్ ని తెరకెక్కిస్తున్నాడు. 

 Also Read :  ANR: తెలుగు ఇండస్ట్రీ HYD రావడానికి చర్చ్ పార్క్ స్కూల్ కి సంబంధం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading