ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకొని విషాదాలు చోటు చేసుకుంటున్నయి. వరుసగా నటీనటులు మరణించడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ఈ తరుణంలోనే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇళయరాజా అన్న కొడుకు పావలార్ శివన్ (60) మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు.
Advertisement
Also Read:లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేముందు ఈ సంకేతాలు కనిపించడం పక్కా..!
ఇళయరాజా అన్నయ్య పావలార్ శివన్ తండ్రి పేరు పావలార్ వరదరాజన్. ఆయన కూడా సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, గాయకుడిగా పనిచేశాడు. ఇళయరాజా ఇంతటి వారు కావడంలో వరదరాజన్ పాత్ర ఎంతో ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వరదరాజన్ 1973లో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కొడుకు 2020లో కిడ్నీ సమస్య కారణంగా మరణించగా, మరో కొడుకు శివన్ ప్రస్తుతం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
Advertisement
Also Read:అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…?
శివన్ మంచి గిటార్ వాయిద్య కారుడు. ఈయన ఇళయరాజా మ్యూజిక్ టీంలోనే కొనసాగుతూ వస్తున్నారు. సంగీత దర్శకుడిగా రెండు,మూడు చిత్రాలు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సక్సెస్ కాలేకపోవడంతో గిటార్ వాయిద్య కారుడిగానే ఉండిపోయారు. శివన్ కుటుంబ సభ్యులతో కలిసి పాండిచ్చేరిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన మరణ వార్త విన్న సిని ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read:Dasari…. చిరు, బాలయ్య, నాగార్జునలకు ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఏంటి? 1992 నాటి ముచ్చట!