సాధారణంగా ప్రతీ ఏడాది సూర్య, చంద్ర గ్రహాలు వస్తుండే విషయం అందరికీ తెలసిందే. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క చంద్ర గ్రహణం కూడా ఏర్పడలేదు. మరో మూడు రోజుల్లో అనగా మే 05 రాత్రి 8.44 గంటలకు ప్రారంభం కానుంది చంద్ర గ్రహణం. అర్థరాత్రి 1.02 గంటల వరకు కొనసాగనుంది. చంద్రగ్రహణం వ్యవధి దాదాపు 4గంటల 15 నిమిషాల పాటు ఉండనుంది. ఈ చంద్రగ్రహణం మాత్రం భారతదేశంలో కనిపించదు. చంద్ర గ్రహణం సందర్భంగా నాలుగు రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మిథునరాశి :
చంద్రగ్రహణం సమయంలో మిథునరాశి వారికి శుభ ఫలితాలుంటాయి. ఆర్థికంగా బలపడుతారు. అదేవిధంగా ఆదాయం కూడా పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో సమస్యలు పూర్తవుతాయి.
సింహరాశి :
Advertisement
చంద్రగ్రహణం వల్ల కారణంగా ఈ రాశి వారు ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అకస్మికంగా లాభం కలుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
కన్యరాశి :
ఈ రాశి వారి సమస్యలు తొలిగిపోతాయి. వ్యాపారం చేసే వారు భారీగా లాభాలు పొందుతారు. ఉద్యోగుల జీతం పెరగడంతో పాటు ప్రమోషన్ లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశముంది.
మకర రాశి :
చంద్ర గ్రహణం రోజు మకరరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అయ్యే అవకాశముంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి