మూడు ముళ్ళు ఏడడుగులతో మొదలయ్యే భార్యాభర్తల బంధం సముద్రపు అల లాంటిది. అల ఏవిధంగా పడుతూ లేస్తూ,వెళ్తుందో జీవితం కూడా ఆ విధంగానే ముందుకు సాగుతుంది. ఈ సంసార జీవితంలో కష్టాలు,సుఖాలు, బాధలు,బంధాలు, ఏడుపులు,అలకలు ఇలా అనేకం కలగలిసి ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా ఉందని అర్థం. అయితే భార్యాభర్తలు ఒక్కోసారి ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కొంతమంది భర్తలు భార్యలను జోక్స్ చేస్తూనే కించపరుస్తారు. అలా భర్తలు భార్యను ఈ నాలుగు విషయాల్లో కించపరిస్తే అసలు భరించలేరట, అదేంటో ఇప్పుడు చూద్దాం..
also read:రెబల్ స్టార్ ప్రభాస్ లాగే మరో వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా ? అతను కూడా నటుడే..!
Advertisement
#1. తక్కువ చేసి చూడడం: ముఖ్యంగా కొంతమంది భర్తలు భార్యను తక్కువగా అంచనా వేస్తారు. అలా చేయకూడదట ఒకవేళ మీరు కొత్తగా పెళ్లి చేసుకుని ఉన్నవాళ్లయితే వాళ్లకి ఇంటి పనుల్లో సాయం చేయాలట, ఏది ఏమైనా ఆమె తప్పు చేస్తే పదేపదే దాని గురించి మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదట, ఒకవేళ ఆమె తెలియక చేస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పి సద్ది చెప్పాలట. తప్పు చేసింది కదా అని తక్కువ చేస్తూ తరచూ వేధించడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు .
Advertisement
also read:యాంకర్ శ్రీముఖి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది..!!
#2. ఇతరులతో పోల్చడం:
మీ భార్యతో ఏది మాట్లాడిన సహిస్తుంది కానీ ఆమె అందాన్ని కించపరిస్తే అస్సలు సహించదు. నీ భార్య మేకప్ లేదంటే డ్రెస్సింగ్ విషయంలో ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే ఇవ్వండి. పదిమందిలో ఉన్నప్పుడు గట్టిగా అరుస్తూ చెబితే ఆమె బాధ పడుతుందట. అంతేకాదు ఇతర మహిళల అందంతో మీ భార్య అందాన్ని పోలుస్తూ కించపరిస్తే మీ సంసార జీవితంలో అనేక కలతలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు.
#3.కుటుంబాన్ని ఎగతాళి చేయడం:
మీ సంబంధాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి మీ మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ముఖ్యంగా భార్య భర్త కుటుంబాన్ని, భర్త భార్య కుటుంబాన్ని ఎగతాళి చేస్తే
రిలేషన్ దెబ్బతింటుందని అంటున్నారు.
also read:మీ పిల్లలు సరిగ్గా తినడం లేదా.. ఈ 4 చిట్కాలు తప్పనిసరి పాటించండి..!!