Home » “ఏజెంట్”చిత్రాన్ని మిస్ చేసుకున్న హీరో.. జస్ట్ మిస్ అంతే లేదంటే..?

“ఏజెంట్”చిత్రాన్ని మిస్ చేసుకున్న హీరో.. జస్ట్ మిస్ అంతే లేదంటే..?

చాలావరకు ఏ ఇండస్ట్రీలో చూసిన కొన్ని సినిమాలు కొంతమంది హీరో హీరోయిన్లను ఊహించుకొని రాస్తూ ఉంటారు. తీరా ఈ కథను వారికి వినిపించే సమయానికి వారు పలు కారణాల వల్ల రిజెక్ట్ చేయవచ్చు. ఇలా ఇండస్ట్రీలో అనేక సినిమాలు రిజెక్ట్ చేయబడి హిట్ అయినవి ఉన్నాయి, తీవ్రంగా ఫ్లాప్ అయినవి ఉన్నాయి. ఇక హిట్ అయితే అయ్యో సినిమా చేయలేదని అనుకున్న వారు ఉన్నారు. ఫ్లాప్ అయితే అబ్బా నేను చేయలేదు సేఫ్ అయ్యాను అని అనుకునే వారు ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏజెంట్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో చూద్దాం..

also read:కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

ఏప్రిల్ 28వ తేదీన అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ మూవీ విడుదలై ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలుసు. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడుగా చేశారు. అయితే ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ అఖిల్ కాదట. దీనికంటే ముందు ఈ కథ టాలీవుడ్ లోని మరో స్టార్ హీరో దగ్గరికి వెళ్లిందట. కానీ ఆయన రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే మెగా హీరో రామ్ చరణ్. ముందుగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ కథను రాంచరణ్ కి వినిపించారట.

also read:IPL 2023 : రోహిత్ శర్మను ఛీటింగ్ చేసిన సంజూ !

కానీ రామ్ చరణ్ కు ముందే కమిట్మెంట్స్ ఉండటం వల్ల ఈ సినిమాని సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని అప్పట్లో రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అనంతరం అఖిల్ కి కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి చిత్రాన్ని పట్టాలెక్కించారు. కానీ సినిమా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని దారుణంగా బోల్తా పడింది. దీంతో ఈ సినిమాను చేయకపోవడం చాలా మంచిదంటూ మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

also read:వైసీపీ నేతలపై రజినీ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపన చెప్పాల్సిందే..!

Visitors Are Also Reading