Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » వైసీపీ నేతలపై రజినీ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపన చెప్పాల్సిందే..!

వైసీపీ నేతలపై రజినీ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపన చెప్పాల్సిందే..!

by Anji
Ads

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్  కి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రజినీకాంత్ ఎన్టీఆర్, చంద్రబాబుతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో  తాను రాజకీయాల గురించి అస్సలు మాట్లాడను అని కూడా పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్, చంద్రబాబులను పొగిడారు. చంద్రబాబుని రజినీకాంత్ పొగడటం నచ్చని  పలువురు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Also Read :   కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

Ad

 

ముఖ్యంగా  రజినీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీ మంత్రి రోజా,  అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్నీనాని, లక్ష్మీపార్వతి ఇలా చాలా మంది కోలీవుడ్ సూపర్ స్టార్ పై మండిపడుతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజినీకీ లేదని.. ఆయన తమిళనాడులో హీరో కావచ్చు. కానీ ఇక్కడ కాదని.. పక్కా రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలు రజినీకాంత్ అభిమానులను నొప్పించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రజినీకాంత్ ను విమర్శించిన వారిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ట్విటర్ లో #YSRCPApologizerajini అనే హ్యాష్ ట్యాగ్ బాగా డ్రెంట్ అవుతోంది. 

Advertisement

Also Read :  Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు

రజినీకాంత్.. ఎన్టీఆర్, చంద్రబాబులతో తనకు ఉన్నటువంటి అనుబంధంపై మాత్రమే మాట్లాడారని..ఆయన ఎవ్వరినీ కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయలేదు కదా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో రజినీకాంత్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ లతో వైసీపీ నాయకులపై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో అవి తెగ వైరల్ అవుతున్నాయి.  రజినీకాంత్ ని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోం అని మండిపడుతున్నారు అభిమానులు. 

 Also Read :  ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి రెమ్యునరేషన్ ఎంత ? ఇప్పుడు అంతనా ?

Visitors Are Also Reading