Home » రాత్రి మిగిలిపోయిన రోటి తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ? 

రాత్రి మిగిలిపోయిన రోటి తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. మిగిలిపోయిన ఆహారం, రాత్రి చేసిన కూరలు, రోటీలు వంటివి ఏవైనా సరే పక్కన పెడుతుంటారు. ఎక్కువగా వేడి ఉన్న ఆహారం, తాజా పండ్లు మాత్రమే తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ రాత్రి మిగిలిపోయిన రోటీలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. రాత్రి చేసిన రోటీలు చపాతి, సజ్జ, జొన్న వంటివి ఏవైనా సరే మిగిలిపోతే ఉదయాన్నే వాటిని అల్పహారంగా తీసుకోవచ్చు.

Also Read :   ఒత్తిడిని తగ్గించేందుకు సాయపడే ఆహార పదార్థాలు ఇవే..!

Advertisement

 

ప్రధానంగా మధుమేహం, జీర్ణక్రియకు సంబంధించిన ఎన్నో ప్రయోజనాలున్నాయి. షుగర్ బాధితులకు చద్ది చపాతీలు తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయాన్నే ఆ చపాతీలను టీ లేదా ఏదైనా మంచి సలాడ్స్, కూరల్లో తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్ కు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.ముఖ్యంగా గోధుమలు ప్రపంచంలోని అత్యంత సాధారణ తృణధాన్యాల్లో ఒకటి. ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.  గోధుమపిండి గ్లైసెమిక్ ఇండెక్స్ లో మితంగా, అధిక స్థాయిలో ఉంటుంది. గ్లైసెమిక్ లోడ్, ఇది కరగని ఫైబర్ కి మంచి మూలం. భోజనం తరువాత రక్త ప్రతిస్పందనను తగ్గించడంలో ప్రభావంతంగా పని చేస్తుంది. ఆరోగ్యకరమైన గట్ మైక్రో బయోటాను పెంచుతుంది. రెసిస్టెంట్ స్టార్చ్ మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది.

Advertisement

Also Read :  కోపం ఎందుకు వస్తుంది…? దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి?

హైబీపీతో బాధపడేవారు ఈ చపాతీలను 10 నిమిషాల పాటు గోరువెచ్చని పాలలో నానబెట్టి తినడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలు, ఎసిడిటి, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాలల్లో చపాతీలను నానబెట్టి తినడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. రోటీలలో గ్లూకోజ్ పరిమాణం కూడా తగ్గుతుంది. పాలతో తింటే చక్కర స్థాయి కంట్రోల్ లో ఉంటుంది. పిల్లలు సన్నగా ఉంటే బరువు పెరిగేందుకు రాత్రి మిగిలిపోయిన రోటీలను తినడం అలవాటు చేయాలి. ఉదయం అల్పాహారంలో వీటిని పాలలో వేసుకొని తినడం వల్ల మీరు ఆరోగ్యం మెరుగు అవుతుంది. రాత్రి మిగిలిపోయిన చపాతీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకున్నట్టయితే మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. వేసవిలో చల్లని పాలతో రోటిని తిన్నట్టయితే శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. శరీరంలో వేడి ప్రభావం ఉండదు. ఎసిడిటి సమస్యలు రావు. మజ్జిగతో కానీ లస్సీతో కానీ తింటే ఇంకా మేలు జరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు చల్లని పాలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినేవారు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading