Home » ఎన్నికల ముందు జగన్ మరో అస్త్రం..మే 9న “జగనన్నకు చెబుదాం”

ఎన్నికల ముందు జగన్ మరో అస్త్రం..మే 9న “జగనన్నకు చెబుదాం”

by Bunty
Ad

 

ఎన్నికల ముందు జగన్ మరో అస్త్రం వదిలారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. మే 9న జగనన్నకు చెబుదాం ప్రారంభం అవుతుందని.. దీని కోసం 1902 హెల్ప్‌లైన్‌ నంబర్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామన్నారు.

read also : ఉపేంద్రతో లవ్ ఎఫైర్…. అలాంటివి కామన్ అంటూ నటి సంచలనం…!

Advertisement

 

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి నా పేరును కలిపారు.. అంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతో ఇట్టే అర్థం అవుతుందని చెప్పారు. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం అని.. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం అని పేర్కొన్నారు జగన్. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం అని వెల్లడించారు.

Advertisement

read also : సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి.. ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేయాలన్నారు. గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలని.. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం అని వెల్లడించారు సిఎం జగన్.

Read also : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Visitors Are Also Reading