టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది నటి అభినయ. ఆమె పుట్టుకతోనే చెవిటి మరియు మూగ ఆయిన ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకెళ్ళింది. కానీ తన తల్లిదండ్రులు ఎలాగైనా మీకు మాటలు తెప్పించి మామూలు మనిషిని చేయాలని 11 లక్షల వరకు అప్పులు తీసుకువచ్చి మరి తమిళనాడు రాజధాని చెన్నై నుండి హైదరాబాద్ తీసుకువచ్చారు. అభినయకు స్పీచ్ తెరఫీ క్లాసులు ఇప్పించారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఆబినయ పేరుకు తగ్గట్టుగా నటనలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏడవ తరగతి లోనే తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి వావ్ అనిపించింది.
also read:తిరుపతిలో ఒక్కరోజు అన్నదానం చేయాలంటే ఖర్చు ఇన్ని లక్షలా..?
Advertisement
కానీ ఆ తర్వాత అవకాశాలు రావట్లేదు. దీనికి కారణం ఆమెకు వినపడకపోవడం మరియు మాట్లాడకపోవడం. అయితే అభినయకు మాత్రం నటన పట్ల చాలా ఆసక్తి ఇది గమనించిన తండ్రి యాడ్స్ లో అయినా నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. యాడ్స్ లో అయితే మాట్లాడాల్సిన అవసరం ఉండదని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా అభినయ అనేక యాడ్స్ లో నటించింది. అయితే తన తండ్రి వెళ్ళిన ప్రతి చోట తనతో పాటు తన కూతురు ఫోటోలు కూడా ఇచ్చేవాడు. ఆమె ఫోటోలు చూసిన ప్రతిచోట అమ్మాయి భలే ఉంది అనేవారు కానీ మాటలు రావు అని చెప్పడంతో ముఖం చాటేసేవారు. ఇదిలా ఉండగా నాదోదిగల్ అనే సినిమా కోసం ముంబై యాక్టర్స్ ను సెలెక్ట్ చేసుకొని ఉన్నారు. ఆవిడకు తమిళ్ మాట్లాడడం కష్టం కావడంతో ఆ సినిమా నేను చేయనని వెళ్లిపోయింది. కానీ డైరెక్టర్ కొప్పడి ఎలాగైనా సరే కమ్యూనికేషన్ తెలియని హీరోయిన్ ను తీసుకువచ్చి నటింపజేయాలని అనుకున్నాడు. దీంతో వెంటనే అభినయను తీసుకువచ్చి వెండితెరకు పరిచయం చేశాడు.
Advertisement
also read:KARUNA BHUSHAN:నా కొడుకు se*గా ఉన్నావు అమ్మ అంటూ.. అవి చూస్తాడు..!!
అలా ఆ సినిమా భారి హిట్ సాధించడమే కాకుండా ఏకంగా 13 అవార్డులు అందుకుంది. అదే సినిమా తెలుగులో శంభో శివ శంభోగా తెరకేక్కించారు. అయితే ఈ సినిమాలో హీరో రవితేజ చెల్లెలిగా నటించిన అభినయనే. ఈసినిమాను కన్నడలో కూడా తెరకెక్కించారు. ఇకపోతే అభినయ మూగ చెవిటి కావడంతో ఆవిడ ఇలా నటించగలిగిందని అనుమానం రావచ్చు. దీనికి కావలసిన డైలాగ్స్ డైరెక్టర్ ముందుగా అభినయ తల్లిదండ్రులకు చెప్పగా తన కూతురు అభినయకి ముందుగానే తల్లిదండ్రులు సైగల ద్వారా చేసి చూపించారు. దీంతో ఆమె సింగిల్ టేక్ లోనే ప్రతి సీన్ చేసి చూపించింది. ఈ విధంగా అభినయ మొదటి సినిమాకి మంచి గుర్తింపు సాధించడమే కాకుండా ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కించుకుంది.
also read:ALLARI NARESH:4 రోజుల్లో 500 సిగరెట్లు తాగా.. చివరికి ఏమైందంటే..!!