దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అద్భుతమైన సినిమాలలో బొంబాయి ఒకటి. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలు పోషించగా.. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. బొంబాయి మత కలహాల నేపథ్యంలో వచ్చిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అరవింద్ స్వామి నటనను ఎవ్వరూ మరిచిపోలేరు. విరహ వేదనలో ప్రేయసి కోసం ప్రేమ వానలో తడిసి ముద్దవుతూ.. ఊరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు.. కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు.. అంటూ హీరో పాడే పాట ఇప్పటికీ హృదయాలను తాకుతుంది. కళాత్మక విలువలతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది ఈ సినిమా. అరవింద్ స్వామి ఫస్ట్ ఛాయిస్ కాదట. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.
Also Read : Vasthu: పొద్దున నిద్ర లేవగానే ఈ వస్తువులు చూశారా దరిద్రం మీవెంటే..?
Advertisement
Advertisement
బొంబాయి సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో మరెవ్వరో కాదండోయ్.. చియాన్ విక్రమ్. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి బొంబాయి సినిమాలో హీరో పాత్రకు తొలుత విక్రమ్ ని అనుకున్నారట దర్శకుడు మణిరత్నం. కానీ ఇందుకు ఆయనతో ఫొటో షూట్ జరిగిందట. అదే రోజు సాయంత్రం మనీషా కోయిరాలాతో షూట్ జరిగిందట. ఈ సినిమా కోసం విక్రమ్ కోసం గడ్డం తీసేయాల్సి ఉంటుందని సూచించారట దర్శకుడు మణిరత్నం.
కానీ అప్పటికే విక్రమ్ ఓ సినిమా చేస్తుండటంతో అందులో హీరో పాత్రకు గడ్డం కీలకం కావడంతో బొంబాయి సినిమా నుంచి అయిష్టంగానే తప్పుకున్నాడట విక్రమ్. ఈ మూవీ మిస్ కావడంపై ఇప్పటికీ బాధపడుతుంటారట చియాన్ విక్రమ్. మణిరత్నం సినిమాలో నటించాలనేది ప్రతీ నటుడి కల. అలాంటి సమయంలో భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే బొంబాయి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో అరవింద్ స్వామి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నప్పటికీ విక్రమ్ మాత్రం అద్భుతమైన నటనతో ప్రేక్షకులు మెప్పిస్తున్నాడు.
Also Read : స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో మాత్రమే ఇలా ప్రవర్తిస్తారట..!