Ad
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నా కానీ విష్ణు ప్రియ యాంకరింగ్ చాలా వెరైటీగా ఉంటుంది. యాంకరింగ్ తోనే కాకుండా తన అందచెందాలతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తుంది. బోల్డ్ బ్యూటీగా మంచి గుర్తింపు సాధించిన విష్ణు ప్రియ జీవితంలో అనేక చీకటి కోణాలు ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దామా.. జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈమె విభిన్నంగా గ్లామర్ షోల్ చేస్తూ, సుడిగాలి సుదీర్ పోవే పోరా షో ద్వారా పాపులర్ అయింది.
కెరియర్ తొలినాళ్లలో పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ రాను రాను డోస్ పెంచేసింది. ఇక 2016 లో 21 సెంచరీ లవ్ తో పాట్ గా 2020లో చెక్ మెట్ అనే మూవీ లో హీరోయిన్ గా చేసింది. ఇటీవలే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ కుర్ర కారు మదిని దోచేసింది. ఇందులో ఆమె అందచందలను ఆరబోస్తూ చూపు తిప్పుకొనివ్వడం లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది విష్ణు ప్రియ. అలాంటి ఈమె అందరినీ నవ్వుతూ నవ్విస్తూ తన జీవితంలో ఉన్న కష్టాల గురించి వెల్లడించింది.
తమ అమ్మానాన్నలది చీరాల బాపట్ల అని, పుట్టింది చెన్నై అని చెప్పింది. తన మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామని చెప్పేసింది.. మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు సరిగా తిండి కూడా లేదని, కాస్తాన్ని డబ్బులు సంపాదించుకొని ఆర్డర్స్ పెట్టుకొని తినే వాళ్ళమని తన కష్టాలు చెప్పింది. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి ఫుడ్ కూడా తినలేని పరిస్థితి ఎదుర్కొన్నామని తెలియజేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement