Home » హీరోయిన్స్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఈ నటుల పారితోషికం ఎంతో తెలుసా..?

హీరోయిన్స్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఈ నటుల పారితోషికం ఎంతో తెలుసా..?

by Sravanthi
Ad
 నటన టాలెంట్ ఉండాలి కానీ ఇండస్ట్రీలో ఆఫర్స్ కు కొదువ ఉండదు.  అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఎంతోమంది హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత అత్త,బామ్మ, అమ్మ పాత్రలతో  నెట్టుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రెండు పూర్తిగా మారింది.  వయసు మల్లిన హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.  హీరోయిన్లకు దీటుగా రాణిస్తూ దూసుకుపోతున్నారు.  ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ, నదియా ఇతర సీనియర్ హీరోయిన్స్. ఈ విధంగా హీరోయిన్స్ గా వీరికి రెమ్యూనరేషన్ కూడా  భారీగానే ఉందని తెలుస్తోంది.
బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఒక్క రోజుకి రెండున్నర లక్షలు అమౌంట్ తీసుకుంటుందట.  పలు భాషా చిత్రాల్లో మదర్ క్యారెక్టర్ చేస్తున్న నదియా  రోజుకు రెండు లక్షలు  పారితోషకం తీసుకుంటుంది.  తెలుగులో సహజనటిగా గుర్తింపు పొందిన జయసుధ అమ్మ వదిన పాత్రలలో ఒదిగిపోతుంది.  పది రోజుల షూటింగ్ కి 20 లక్షలు ఒకవేళ పది రోజులు దాటితే రోజుకి లక్ష రూపాయల ఎక్కువ తీసుకుంటారట.  నటి పవిత్ర లోకేష్ కూడా ఒక్క రోజుకి 60000 తగ్గకుండా అందుకుంటారట.  అదేవిధంగా ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన రాశి ఇప్పుడు 75 వేల వరకు అందుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే వివిధ భాషల్లో మదర్ క్యారెక్టర్లు చేస్తున్న రోహిణి రోజుకి 50,000 నుంచి 60 వేలు అలాగే శరణ్య ఒక్కో రోజుకు సినిమాకి 20 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  అలాగే రేవతి తల్లి పాత్రలకు 15 లక్షలు తీసుకుంటుందట.  ఇక ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని ఒక్క సినిమాకు రెండు కోట్ల రూపాయలు అందుకుంటుందట.  ఈ విధంగా హీరోయిన్స్ గా రానించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తూ కూడా బాగానే సంపాదిస్తున్నారు ఈ నటిమనులు.

Advertisement

Visitors Are Also Reading