ఐపీఎల్ 16వ సీజన్ ఇప్పటికే సగానికి చేరుకుంది. పరుగుల వర్షం కురిసే ధనాధన్ లీగ్ లో వికెట్లు పడగొట్టడం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టే ఆటగాళ్లకు పర్పుల్ క్యాప్ ఇస్తారనే విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇప్పటివరకు జరిగిన టోర్నీల్లో అత్యధిక వికెట్లను పడగొట్టి పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్న టాప్ 5గురు ఆటగాళ్ల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పర్పుల్ క్యాప్ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ వద్ద ఉంది. టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడిన సిరాజ్ 28 ఓవర్లు వేసి మొత్తం 18 వికెట్లను తీసుకున్నాడు.
మహ్మద్ సిరాజ్ తో పోటీ పడుతూ పర్పుల్ క్యాప్ రేసులో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 7 మ్యాచ్ ల్లో 25 ఓవర్లు వేసిన అర్ష్ దీప్ కూడా 13 వికెట్లను పడగొట్టాడు.
Advertisement
ఈ లిస్ట్ లో యజ్వేంద్ర చాహల్ కూడా ఉన్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరపున 7 మ్యాచ్ ల్లో మొత్తం 28 ఓవర్లు వేసి 12 వికెట్లను తీశాడు.
Also Read : IPL 2023 : కావ్య పాపపై రివెంజ్ తీర్చుకున్న వార్నర్…
బౌలింగ్ లో సంచలన రికార్డును కలిగిన రషీద్ ఖాన్ ఈ లిస్ట్ లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరుపున 6 మ్యాచ్ లు ఆడిన రషీద్ ఈ లిస్ట్ లో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను 24 ఓవర్లు వేసి 12 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్న టాప్ 5 ఆటగాళ్ల లిస్ట్ లో తుషార్ దేశ్ పాండే 5వ స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున మెరుగ్గా రాణిస్తున్న దేశ్ పాండే 7 మ్యాచ్ లలో 12 వికెట్లు పడగొట్టాడు. అతను కూడా 25 ఓవర్లు వేసి వికెట్లను పడగొట్టాడు.
Also Read : ధోని కోపంతో బ్యాట్ విరగొట్టాడు..విధ్వంసం సృష్టించాడు !