క్రికెట్ అభిమానులు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 7 నుంచి 11 వరకు లండన్ లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బిజీగా ఉండగా… క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ పై దృష్టి పెట్టింది. ఏకంగా జట్టునే ప్రకటించింది.
READ ALSO : ధోని కోపంతో బ్యాట్ విరగొట్టాడు..విధ్వంసం సృష్టించాడు !
Advertisement
డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ తో పాటు ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న యాషెస్ సిరీస్ లోని తొలి రెండు టెస్టులకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తో పాటు జోష్ ఇంగ్లీస్, మార్కస్ హారిస్ లు చోటు దక్కించుకున్నారు. ఇది ఇలా ఉండగా, WTC ఫైనల్ లో రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, ఛేతేశ్వర్ పూజార, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్ ఉన్నారు.
Advertisement
READ ALSO : ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తారు !
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, ఛేతేశ్వర్ పూజార, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్
ఆస్ట్రేలియా : పాట్ కమ్మిన్స్ (సి), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
Also Read: దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?