ఐపీఎల్ 2023 టోర్నీ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే, శనివారం జరిగిన రెండో మ్యాచ్ లో పంజాబ్ 13 పరుగుల తేడాతో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గైర్హాజరిలో సామ్ కరణ్ జట్టును ముందుండి నడిపించారు. ముంబై కుంభస్థలాన్ని బద్దలుకొడుతూ పంజాబ్ కింగ్స్ అనిపించింది. మొత్తంగా ఆరేండ్ల తర్వాత వాంకడేలో పంజాబ్ తొలి విజయాన్ని ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి సమయంలో బంతి అందుకున్న అర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.
READ ALSO : ఫ్యాన్ వార్ : పవన్ కళ్యాణ్ అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్ ఫ్యాన్!
Advertisement
తొలి బంతికి టీం డేవిడ్ సింగిల్ తీశాడు. మరుసటి బంతి డాట్ బాల్. ఆ తర్వాత బంతికి అద్భుతమైన యార్కర్ వేసిన అర్షదీప్… మిడిల్ స్టంప్ ను విరగ్గొట్టాడు. మరుసటి బంతికే వధిరాను కూడా సేమ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. అప్పుడు కూడా మిడిల్ స్టంప్ విరిగిపోయింది. దీంతో చివరి ముంబైకి రెండు బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు జోప్రా ఆర్చర్ కు మరో డాట్ బాల్ వేశాడు. చివరి బంతికి కేవలం సింగిల్ వచ్చింది. దీంతో ముంబై జట్టు 201 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Advertisement
READ ALSO : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!
అయితే ఇలా చివరి ఓవర్ ను అర్షదీప్ సింగ్ ఇవ్వడం వల్ల నిర్వాహకులకు 60 లక్షలు నష్టం వాటిల్లింది. ఎందుకంటే అతను ఈ ఓవర్లో రెండు వికెట్లు తీయగా ఇద్దరు బ్యాటర్లు యార్కర్లు ఆడలేక పెవీలియన్ చేరారు. ఈ క్రమంలో రెండుసార్లు మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే కాదు. క్రికెట్ లో వాడే జింగ్ బెయిల్స్ వికెట్లు వాడుతున్న సంగతి తెలిసిందే. ఈ వికెట్లు చాలా ఖరీదైనవి. ఒక్కో వికెట్ సెట్ ఖరీదు 40 వేల డాలర్లు అంటే… రూ.30 లక్షల పైగా ధర పలుకుతుంది. ఈ లెక్కన ఒక్కో వికెట్ రేటు రూ.10 లక్షలు అన్నమాట. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో అర్షదీప్ రెండు వికెట్లు విరగ్గొట్టాడు. అంటే అతనికి ఈ ఓవర్ ఇచ్చినందుకు బీసీసీఐకి తక్కువలో తక్కువ రూ. 20 లక్షలు నష్టం వచ్చినట్లే కదా. అదే కనుక ఈ రెండు వికెట్ సెట్లు మార్చేయాల్సి వస్తే రూ. 60 లక్షలు నష్టం వచ్చినట్లేనని చెబుతున్నారు విశ్లేషకులు.
READ ALSO : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!