ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాదయాత్ర చేసి, దాదాపు 10 ఏళ్ల పాటు ప్రతి పక్షంలో కూర్చుని, అధికారంలోకి వచ్చారు జగన్. చాలా కష్టపడి, వైసీపీ ని అధికారంలోకి తీసుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి.. ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. అయినప్పటికి.. ఏపీ ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉండేది. రాజధాని, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ఏపీ ప్రజలు చాలా ఘరంగా ఉన్నారు. ఇదంతా పక్కకు పెడితే, ఈ తరుణంలో.. తాజాగా రిలీజ్ అయిన ఓ సర్వే రిపోర్టు.. జగన్ సర్కార్ కు భారీ ఊరటను ఇచ్చింది.
READ ALSO : Maama Mascheendra : దుమ్ము లేపుతున్న ‘మామా మశ్చీంద్ర’ టీజర్
Advertisement
ఏపీలో వైసీపీ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగనుందని ప్రముఖ వార్త ఛానల్ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్ స్వీప్ చేయడం కాయమని పేర్కొంది. వైయస్సార్సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్ నౌ-ఈ టీజీ చేసిన సర్వే తేల్చింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా మోడీ మేనియా కొనసాగనుందని కేంద్రంలో వరుసగా మూడోసారి బిజెపి విజయం ఖాయమని సర్వే. బిజెపి కూటమికి 292 నుంచి 338 స్థానాలు రావచ్చని పేర్కొంది.
Advertisement
READ ALSO : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 వరకు, ఇతరులకు 66 నుంచి 96 దాకా సీట్లు లభిస్తాయని తెలిపింది. బిజెపి కూటమికి 38.2%, కాంగ్రెస్ కూటమికి 28.7, ఇతరులకు 33.1% ఓట్లు వస్తాయని పేర్కొంది. బిజెపి నిస్సందేహంగా 300 పై చిలుకు స్థానాలు గెలుస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది, కష్టమని 26%, ఎన్నికల నాటికే దీనిపై స్పష్టత వస్తుందని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు. 13 శాతం ఏమీ చెప్పలేమన్నారు. మోదీ 2.0 పాలన తీరు అత్యంత సంతృప్తికరంగా ఉందని, ఏకంగా 51 శాతం మంది చెప్పారు. చాలావరకు సంతృప్తికరమైననీ 16 శాతం, ఓ మాదిరిగా ఉందని 12 శాతం చెప్పగా, బాలేదని 21 శాతం బదులిచ్చారు. అయితే, వైసీపీ డబ్బులు ఇచ్చి.. ఈ సర్వే చేయించుకుందని.. ఆరోపణలు చేస్తున్నాయి ఏపీ ప్రతి పక్షాలు. మరి దీనిపై వాస్తవం ఏంటో తెలియాలంటే.. ఎన్నికలు వచ్చే దాకా ఆగాల్సిందే.
READ ALSO : Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..