క్రికెట్ లో టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కొంతమంది క్రికెట్ దేవుడు అని పిలుస్తుంటారు. ఈ మాజీ ఆటగాడు ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించారు.#AskSachin అంటూ చిట్ చాట్ చేశారు. అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు చాలా ఓపికగా సచిన్ సమాధానం చెప్పారు. కొందరూ ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఫన్నీ ఆన్సర్స్ చేశారు. 2011లో వన్డే ప్రపంచ కప్ పైనల్ లో ఔట్ అయిన తరువాత సచిన్ పెవిలియన్ కి వెళ్తూ.. తరువాత క్రీజులోకి వస్తున్న విరాట్ కోహ్లీకి తాను ఏం చెప్పాడో కూడా అభిమానులో పంచుకున్నారు.
Also Read : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!
Advertisement
శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ ను మలింగ డకౌట్ చేశాడు. ఆ తరువాత 18 రన్స్ చేసిన సచిన్ కూడా పెవిలీయన్ కి పంపించాడు. డగౌట్ కి వెళ్తున్న సచిన్ కి క్రీజ్ లోకి వస్తున్న కోహ్లీ ఎదురయ్యాడు. ఆ సందర్భంలో విరాట్ కోహ్లీకి సచిన్ ఏదో విషయం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ అభిమాని షేర్ చేస్తూ.. మీరు విరాట్ కి ఏం చెప్పారని అడిగాడు. దీనికి సచిన్ సమాధానం ఇస్తూ.. బంతి కాస్త ఇంకా స్వింగ్ అవుతోంది అని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గౌతమ్ గంభీర్ తో కలిసి విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. సచిన్ చెప్పిన మాటతో క్రీజ్ లో జాగ్రత్తగా ఆడుతూ 49 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
Advertisement
ఒక మరో అభిమాని ధోనిని ఏమని పిలుస్తారని అడగగా తాను ఎం.ఎస్.అని పిలుస్తానని చెప్పారు సచిన్. మీకు ఇష్టమైన షాట్ ఏది అని ప్రశ్నించగా.. అప్పర్ కట్, స్ట్రెయిట్ డ్రైవ్ అని చెప్పారు. వాంఖడే తరువాత తనకు రెండో ఇష్టమైన స్టేడియం చెన్నై చెపాక్ అని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు సచిన్. వాస్తవానికి సచిన్ ఫెవరేట్ గ్రౌండ్ వాంఖడే అని అందరికీ తెలిసిందే. ఇష్టమైన ఫుడ్ ఏది అని ప్రశ్నించగా.. బిర్యాని అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఫుట్ బాల్ ప్లేయర్ ఎవరు ? అని అడగ్గా మెస్సీ అని తెలిపారు. ఇలా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు సచిన్.
Also Read : టీమిండియా లోనే అత్యంత దురదృష్ట ప్లేయర్స్ వీళ్లే..!