కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి తెలియని వారు ఉండరు. అయితే ఆయన అసలు పేరు భక్తవత్సలం ఆ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మోహన్ బాబు హీరోగా అవకాశం పొందడం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు…కారణం ఇదే..?
Advertisement
దర్శకరత్న దాసరి నారాయణరావు అందరూ కొత్త వాళ్లను పెట్టి తీసిన సినిమా స్వర్గం-నరకం. 1975లో విడుదలైన ఈ సినిమా ద్వారా మోహన్ బాబు, ఈశ్వర్ రావు హీరోలుగా అన్నపూర్ణ, జయలక్ష్మీ హీరోయిన్ లుగా పరిచయమయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం. ఈశ్వర్ రావు అసలు పేరు విశ్వేశ్వర్ రావు. వారి అసలు పేర్లను ఈ సినిమాతో మార్చేశారు దర్శకరత్న దాసరినారాయణరావు. తొలుత నాటకాల్లో నటించే ఈశ్వర్ రావును ఒక హీరోగా సెలెక్ట్ చేసిన దాసరి.. మరోహీరోగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న మోహన్ బాబుని ఎంపిక చేశారు. స్వర్గం-నరకం సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ ఫిలింస్ వారు బోసుబాబు అనే యువకుడిని పంపించి అతనికి హీరోగా ఛాన్స్ ఇవ్వాల్సిందేనని.. ఈ సినిమాకి నిర్మాణ సారథ్యం వ్యవహరిస్తున్న వీబీ శ్రీహరి రావు మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
Also Read : సాయిధరమ్ తేజ విరూపాక్ష మేకింగ్ వీడియో చూశారా ? ఎలా ఉందంటే?
Advertisement
అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిందే వేదం. దీంతో దాసరికి శ్రీహరిరావు విషయం చెప్పి బోస్ బాబుకు హీరోగా ఛాన్స్ ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందిపడుతారేమోనన్నారు. అప్పటికే తాను సెలెక్ట్ చేసిన మోహన్ బాబు ని తీసుకోవాలా ? బోస్ బాబుని తీసుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు దర్శకుడు దాసరినారాయణరావు. ఈ విషయాన్ని గమనిస్తు వచ్చిన దాసరికి తన అసిస్టెంట్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తన గురువుకు ఓ సూచన చేశారు. భక్తవత్సలం, బోస్ బాబులను ఇద్దరినీ షూటింగ్ కి తీసుకెళ్దాం. ఒకే స్క్రీన్ పై వీరిద్దరినీ యాక్ట్ చేయమని చెబుదాం. ఎవరు బాగా నటిస్తే వారిని హీరోగా సెలెక్ట్ చేద్దాం. రికమండేషన్స్ కి తావు లేకుండా.. టాలెంట్ కి మాత్రమే ఇచ్చినట్టు అవుతుంది అని రవిరాజా చెప్పారు. రవిరాజా చెప్పిన మాట దర్శకుడు దాసరికి బాగా నచ్చి విజయవాడలో షూటింగ్ ప్రారంభించాడు. వీరిద్దరికీ ఒకే ఒక సీన్ చిత్రీకరించారు.
షూట్ చేసిన ఫిలింను అప్పటికప్పుడు మద్రాస్ కి పంపించి డెవలప్ చేయించారు. ఆ తరువాత రోజు దానిని విజయవాడకు తెప్పించి దానిని ఒక థియేటర్ లో వేసుకొని చూశారు. దాదాపు అందరికీ భక్తవత్సలం పర్పామెన్స్ నచ్చింది. అతన్ని హీరోగా తీసుకున్నారు దర్శకుడు దాసరి నారాయణరావు. అలా మోహన్ బాబు స్వర్గం నరకం ద్వారా తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమాలో హీరో అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నారు బోస్ బాబు. ఆ బోస్ బాబు మరెవ్వరో కాదు.. బోస్ ఈజ్ బ్యాక్ అంటూ ఎస్.వీ.ఆర్ ట్రావెల్స్ విజయవంతంగా నడుపుతున్నది ఆయనే. సినిమా నటుడు కావాలనుకున్న బోస్ బాబు చివరికీ వ్యాపార రంగంలో సక్సెస్ సాధించి బాగా సంపాదించారు. మొత్తానికి మోహన్ బాబు వల్ల బోస్ బాబు బస్సు బాబు అయ్యాడు. పలు రాష్ట్రాల్లో ఆయన ఎస్.వీ.ఆర్ ట్రావెల్స్ బాగా పాపలర్ అయ్యాయి.
Also Read : Vidudala Part 1 Movie : విడుదలై 1 సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్..