Home » Jr NTR పెళ్లిచూపుల్లో లక్ష్మీ ప్రణీతిని ఎలాంటి ప్రశ్న వేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Jr NTR పెళ్లిచూపుల్లో లక్ష్మీ ప్రణీతిని ఎలాంటి ప్రశ్న వేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi
Ad

అప్పుడప్పుడు కొంతమంది జీవితాలు చాలా కష్ట కాలం నుంచి బయటకు వస్తాయి. అన్నీ ఉన్నా కానీ తినే భాగ్యం ఉండదు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒక్కోసారి అయిన వాళ్ళు కూడా దగ్గరికి తీయరు. అదే మనం ఒక పొజిషన్ లోకి వెళ్తే అయిన వాళ్లతో పాటు మనకు దూరం చుట్టాలు కూడా మనవాళ్లే అని చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితిని పక్కాగా ఎదుర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాలను ఏలిన నందమూరి ఫ్యామిలీలో పుట్టి మొదట్లో కనీసం ఆ ఫ్యామిలీ వారి ఆదరణ లేక అనేక ఇబ్బందులు పడ్డారు.

also read:బాలయ్య డైరెక్షన్ చేద్దాం అనుకున్న ఆ చిత్రాలను ఎన్టీఆర్ చేశారట.. కారణం తెలిస్తే..!!

Advertisement

అయినా అది నా ఫ్యామిలీ అని తాత పేరు నిలబెట్టాలనే కోరికతో ఎంతో కష్టపడి తాతకు తగ్గ మనవడిగా నందమూరి ఫ్యామిలీ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అలా ఎన్టీఆర్ ఇంతలా ఎదగడానికి ఎంతో కష్టపడ్డారు.. కట్ చేస్తే ఎన్టీఆర్ మంచి స్థాయి కి చేరుకున్న తర్వాత లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి ఒక షోలో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు ఎన్టీఆర్. పెళ్లి చూపుల సమయంలో ఎన్టీఆర్ ను లక్ష్మీ ప్రణతి తలెత్తి కూడా చూడడం లేదట.

Advertisement

also read:Chanakya Niti : ఈ చిట్కాలను పాటిస్తే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు

ఆ తర్వాత ఆమెతో మాట్లాడినప్పుడు ఈ పెళ్లి అంటే ఇష్టమేనా అని అడిగారట ఎన్టీఆర్. అయినా లక్ష్మీ ప్రణతి ఏ సమాధానం చెప్పలేదట. ఇక ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి మధ్యలో 8 నెలల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఎన్నో ప్రశ్నలు వేశారట. కానీ లక్ష్మీ ప్రణతి మాత్రం నో అని ఆన్సర్ చెప్పేదట. అప్పుడు కానీ ఎన్టీఆర్ కు అర్థం కాలేదట ఆడవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం అని, ఆ విషయం తెలిసిన వాడు ప్రపంచాన్ని ఏలుతాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ దంపతులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

also read:శ్రీదేవి కూతురు వెంట ప‌డుతున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?

Visitors Are Also Reading