Home » రమా రాజమౌళి లవ్ స్టోరీ.. ఆ ఒక్క ట్విస్ట్ మామూలుగా లేదు.. ఎంత రిస్క్ అంటే..?

రమా రాజమౌళి లవ్ స్టోరీ.. ఆ ఒక్క ట్విస్ట్ మామూలుగా లేదు.. ఎంత రిస్క్ అంటే..?

by Sravanthi Pandrala Pandrala

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సున్నిత మనస్తత్వం కలిగిన వారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలు గర్వించే విధంగా చేసిన ఘనత ఆయనదే. అయినా ఆయనకు హంగు ఆర్భాటాలు ఏమీ లేవు. ఉన్నదల్లా సినిమా సినిమా సినిమా. చక్కని సినిమా తెరకెక్కించి ప్రేక్షకులకు అందించడమే ఆయన ముందున్న లక్ష్యం. అలాంటి రాజమౌళి సినిమా అంటేనే ఎన్నో ట్విస్టులు, ప్రేక్షకుల మనసులను కదిలించే గుబాలింపులు ఉంటాయి. అలా ఆయన సినిమా ఎలా ఉంటుందో రాజమౌళి నిజజీవితంలో లవ్ స్టోరీ కూడా ఆ విధంగానే ఉందట.. మరి అదేంటో పూర్తిగా చూద్దామా.. రియల్ స్టోరీ కి ఏ మాత్రం తీసిపోని రీతిలో లవ్ స్టోరీ ఉంది..

also read:కొత్త కారు కొన్న దుల్కర్ సల్మాన్.. ఎన్ని కోట్లో తెలుసా..?

కీరవాణి రాజమౌళి ఇద్దరు అన్నదమ్ముల కొడుకులు. అయినా కీరవాణిని రాజమౌళి ఎంతగా గౌరవిస్తారో మనందరికీ తెలుసు. కీరవాణి భార్య వల్లి సోదరి రమ.. దీంతో వీరిద్దరి మధ్య సాదాసీదా పరిచయం ఉండేది. రాఘవేంద్రరావు వద్ద శిష్యుడిగా ఉన్న సమయంలో రాజమౌళి శాంతినివాసం సీరియల్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ సొంతం చేసుకున్నారు. ఆ సమయంలోనే రమాకు రాజమౌళికి మధ్య కాస్త పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసే సమయంలో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికే రమాకు పెళ్లయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇంట్లోని వారందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రాజమౌళి.

also read:Dasara movie : ఓటీటీలో నాని ‘దసరా’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడో తెలుసా?

సినిమా కుటుంబం కావడంతో బయట హడావిడి లేకుండా చాలా సాదాసీదాగా పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసేసారు. పెళ్లి తర్వాత తమకు పిల్లలు పుడితే కార్తికేయను సరిగా చూడలేమన్న ఆలోచనతో పిల్లలు వద్దన్నా నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కాలంలో ఒక ఆడపిల్లను కూడా దత్తత తీసుకొని ఆమెను పెంచుకుంటున్నారు. ఈ విధంగా ప్రేమకు అసలు సిసలు నిర్వచనం రాజమౌళి అనే విధంగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. తాను ప్రేమించిన వారి కోసం తన ప్రేమ మొత్తాన్ని ఇవ్వడమే కానీ తీసుకోవడం లాంటివి రాజమౌళికి అసలు తెలియవు.

also read:Sreeleela : 10 సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న శ్రీలీలా!

Visitors Are Also Reading