Home » వైజ‌యంతీ బ్యాన‌ర్ లోగో కు అన్న‌గారి ఫోటో ఎందుకు ఉంటుంది..? దాని వెన‌క ఉన్న స్టోరీ ఏంటి..?

వైజ‌యంతీ బ్యాన‌ర్ లోగో కు అన్న‌గారి ఫోటో ఎందుకు ఉంటుంది..? దాని వెన‌క ఉన్న స్టోరీ ఏంటి..?

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాప్ బ్యాన‌ర్ ల‌లో వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ ఒక‌టి. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోల నుండి నేటి స్టార్స్ వ‌ర‌కూ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ లో న‌టిస్తున్నారు. ఈ బ్యాన‌ర్ ను అశ్విని ద‌త్ స్థాపించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ నుండి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన చాలా మంది హీరోలు ప్ర‌స్తుతం టాప్ లో ఉన్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోగా రానిస్తున్న రామ్ చ‌ర‌ణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

చిరుత సినిమాను వైజ‌యంతీ బ్యాన‌ర్ లోనే నిర్మించారు. అంతే కాకుండా రాజ‌కుమారుడు సినిమా ద్వారా మ‌హేశ్ బాబును చిత్ర ప‌రిశ్ర‌మ‌కు హీరోగా ప‌రిచయం చేసింది కూడా వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ లోనే. అంతే కాకుండా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండి నేటి వ‌ర‌కూ ఎన్నో అద్భుత‌మైన సినిమాలు ఈ బ్యాన‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.

Advertisement

ఎన్టీఆర్ రామారావు న‌టించిన ఎదురులేని మ‌నిషి, చిరంజీవి ఇంద్ర‌, రీసెంట్ గా మ‌హాన‌టి, సీతారామం సినిమాలు కూడా ఈ బ్యాన‌ర్ లోనే వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ లుగా నిలిచాయి. అయితే వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ లోగో చూస్తే అన్న‌గారి ఫోటో మ‌న‌కు క‌నిపిస్తుంది. దాంతో అస‌లు అన్న‌గారి ఫోటోను బ్యాన‌ర్ లోగా గా ఎందుకు తీసుకున్నారు అనే డౌట్ రాక‌పోదు. అయితే దానికి వెన‌క ఓ క‌థ ఉంది. నిర్మాత అశ్వినిద‌త్ కు ఎన్టీఆర్ అన్నా ఆయ‌న సినిమాలు అన్నా చాలా ఇష్ట‌మ‌ట‌.

అంతే కాకుండా ఎన్టీఆర్ ను దగ్గ‌ర‌గా చూసిన వ్య‌క్తుల‌లో ఆయ‌న కూడా ఒక‌రు. ఇక నిర్మాణ‌సంస్థ‌ను ప్రారంభించేట‌ప్పుడే అశ్వినీద‌త్ ఎన్టీఆర్ ను మీ ఫోటో ను పెట్టుంటాను అని కోరార‌ట‌. కానీ ఎన్టీఆర్ వ‌ద్దు బ్ర‌ద‌ర్ నాకు అలాంటివి ఇష్టం ఉండ‌ద‌ని చెప్పారు. కానీ అశ్వినిదత్ విన‌కుండా మ‌ళ్లీ మ‌ళ్లీ అడిగార‌ట‌. దాంతో ఎన్టీఆర్ స‌రే కానివ్వండి బ్ర‌ద‌ర్ అని పర్మిష‌న్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ ఫోటో తో స్థాపించిన నిర్మాణ‌సంస్థ నాటి నుండి నేటి వ‌ర‌కూ నంబ‌ర్ 1 స్థానంలో ఉంది.

Also read : “అపరిచితుడు ” క్లైమాక్స్ లో శంకర్ మనకు చెప్పిన ఈ విషయాన్ని ఎంత మంది గమనించారు ? దాని అర్థం అదేనా ?

Visitors Are Also Reading