చియాన్ విక్రమ్ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. విక్రమ్ తెలుగులో పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా విక్రమ్ కి శివపుత్రుడు, అపరిచితుడు నటన పరంగా ఎంతటి క్రేజీని తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పటివరకు విక్రమ్ కి ఉన్నటువంటి మార్కెట్ అపరిచితుడు సినిమాతో అమాంతం రెట్టింపు అయింది.
Also Read : శ్రీకాంత్ తో పెళ్లికి నో చెప్పిన ఊహ పేరెంట్స్….తమ్మడి కోసం రంగంలోకి దిగిన చిరు ఏం చేశారంటే..?
Advertisement
దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ కెరీర్ లో ”అపరిచితుడు” సినిమా ప్రత్యేకమని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న అవినీతి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది.. దానికి పరిష్కారం ఏంటనే ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. స్ప్లిట్ పర్సనాలిటీని లీడ్ గా తీసుకుని డైరెక్టర్ శంకర్ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో హీరో విక్రమ్ అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.
Advertisement
Also Read : రాజమౌళితో రమ రెండో పెళ్లి.. వీరు పిల్లలను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా ?
2005లో వచ్చి భారత్ మొత్తం సంచలనం సృష్టించిన అరిచితుడు సినిమా క్లైమాక్స్ లో రాము ట్రీట్ మెంట్ తీసుకొని వైఫ్ నందనినీ తీసుకొని వైఫ్ తో హనీమునీ ట్రిప్ కోసం బయటికి వెళ్తాడు. వాళ్లు కూర్చున్న సీటుకు ఎదురుగా ఒక గవర్నమెంట్ వర్కర్ పబ్లిక్ గా డ్రింకింగ్ చేస్తుంటాడు. ఆ మనిషిని రాములో ఉన్న అపరిచితుడు బయటికి వచ్చి రైలు నుంచి తోసి చంపేస్తాడు. వెంటనే శుభం పడిపోతుంది. దీనిని బట్టి రాము లోపల అపరిచితుడు ఉన్నాడని.. అపరిచితుడు 2 మూవీ రాబోతుందని ఆడియన్స్ ఉండిపోతారు. అందరూ అనుకున్నట్టు రామ్ లైన్ మెన్ ని డ్రింకింగ్ తాగినందుకో లేదా పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు చంపడు. రామ్ కి 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన చెల్లెలు విద్య చిన్నతనంలోనే కారణమైన వాళ్లలో ఒకరైన ఈ లైన్ మేన్ రామస్వామిని తన నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పోయినందుకు చాలా సంవత్సరాల తరువాత చంపుతాడు.
Also Read : అకీరా చేసిన పనికి హర్ట్ అవుతున్న పవన్ ఫ్యాన్స్…ఏం చేశాడంటే..?