Home » మీ ఇంట్లో ఈ విగ్రహాలు ఉన్నాయా.. ఉంటే చాలా అదృష్టం..!

మీ ఇంట్లో ఈ విగ్రహాలు ఉన్నాయా.. ఉంటే చాలా అదృష్టం..!

by Sravanthi
Ad

మన భారత దేశంలో చాలామంది వాస్తును నమ్ముతూ ఉంటారు.. వాస్తు శాస్త్రం ప్రకారమే ఇండ్లు కట్టుకోవడం, ఇతర పనులు చేయడం చేస్తూ ఉంటారు. ఏ పని చేయాలన్న వాస్తనేది చాలా ముఖ్యమని నమ్ముతారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే చాలా సమస్యల నుండి మనం బయటపడతామని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఏ పని చేసిన నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే వాస్తు ప్రకారం అనుసరించడం చాలా మంచిదని, వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే మనకు ఎంతో మేలు కలుగుతుందని వేద పండితులు చెబుతుంటారు..

also read:నాగచైతన్య,అఖిల్ రేంజ్ లో సుశాంత్ సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనా ?

Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఉంటే మనకు అదృష్టం కలుగుతుంది.. మన సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం సాలిడ్ సిల్వర్ లేదా కంచు ఏనుగులు ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. దీనివల్ల ధన లాభం ఉంటుంది. అలాగే ఏనుగుని ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలా ఇంట్లో ఉన్న బెడ్ రూమ్ లో కూడా ఏనుగు విగ్రహాన్ని పెట్టుకుంటే వారి యొక్క వివాహ జీవితం కూడా ఆనందంగా ఉంటుందట.

Advertisement

also read:జక్కన్న లేకుంటే ఈ హీరోలు స్టార్స్ అయ్యేవారా..?

అలాగే ఇంట్లో గుర్రం బొమ్మను కూడా ఉంచడం చాలా మంచిదని, గుర్రం విగ్రహాన్ని ఇంట్లో పెడితే సక్సెస్ ని పొందవచ్చని అంటున్నారు. చాలామంది తమ జీవితంలో ఎన్నో పనులు చేసినప్పటికీ వారు ముందుకు వెళ్లలేక పోతారు. కాబట్టి గుర్రం విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సక్సెస్ ని అందుకుంటారు. అంతేకాకుండా ఇంట్లో జంట హంసలని ఉంచితే కూడా ఎల్లప్పుడూ కుటుంబం ఆనందంగా ఉంటుందట. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఆర్థికంగా కూడా బలంగా ఉంటారని వాస్తు శాస్త్రం నిపుణులు అంటున్నారు.

also read:పిండం కాకికే ఎందుకు పెట్టాలి..పురాణం ఏం చెబుతోంది..!!

Visitors Are Also Reading