Home » దాసరి, చిరు ల మధ్య విబేధాలు, మ‌న‌స్ప‌ర్థ‌లు ఇంతలా ఉండేవా ? చివరికి ఏమయ్యిందంటే ?

దాసరి, చిరు ల మధ్య విబేధాలు, మ‌న‌స్ప‌ర్థ‌లు ఇంతలా ఉండేవా ? చివరికి ఏమయ్యిందంటే ?

by Bunty
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. అయితే హీరో అన్న తర్వాత హీట్లతో పాటు ఫ్లాప్ లను కూడా చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బోల్తా కొడుతుంటాయి. అలాంటి సినిమాలు చిరంజీవి ఖాతాలో కూడా ఉన్నాయి. అప్పట్లో వడ్డే రమేష్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా లంకేశ్వరుడు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.

READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

Advertisement

 

నిజానికి దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన శివరంజని సినిమాలో మొదట చిరంజీవిని హీరోగా అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల చిరు ఆ ఛాన్స్ ను మిస్ అయ్యారు. దాంతో లంకేశ్వరుడు సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ పట్టాలెక్కింది. 1988 నవంబర్ నెలలో లంకేశ్వరుడు సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ,ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ కృష్ణ, మరియు నట భూషణ్ శోభన్ బాబు హాజరయ్యారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా హీరోయిన్ రాధ నటించారు.

Advertisement

READ ALSO : జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…

Chiranjeevi, Dasari Narayana Rao, Chandrababu naidu, Mudragada

ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి దాసరిలకు మధ్య కొన్ని గొడవలు జరిగాయి. దాసరి నారాయణరావు ఆ సమయం లో స్టార్ డైరెక్టర్ కాగా చిరంజీవి అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదిగారు. ఈ క్రమంలో దాసరి నారాయణరావు లేకుండానే చిరంజీవి సినిమాలోని రెండు పాటలు మినహా అన్ని పాటలను చిత్రించారు అంటే ఏ రేంజ్ లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఇక నిర్మాత వడ్డే రమేష్ ఆ తర్వాత ఇద్దరినీ చాలా ప్రయత్నం చేసి కలిపి షూటింగ్ పూర్తి చేయించారు. అలా సినిమా పూర్తి అయిన తర్వాత అప్పట్లో ఈ చిత్రాన్ని భారీ రేటుకు అమ్మడం జరిగింది. 1989లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

READ ALSO : సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ రైలు టికెట్‌ ధరలు..టైమింగ్స్‌ ఇవే

Visitors Are Also Reading