సౌత్ ఇండియన్ హీరోయిన్ లలో నిత్యామీనన్ ఒకరు. ఈమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. మూడు దక్షిణాది ఫిల్మ్ ఫెయిర్ పురస్కారాలు, 2 నంది అవార్డులను అందుకుంది. తన ఎనిమిదేళ్ల వయస్సులోనే ద మంకీ హు న్యూ టూమచ్ అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. 17 ఏళ్ల వయస్సులో ఉండగా.. ఓ కన్నడ సినిమా సహాయ నటి పాత్రలో నటించింది. ఆ తరువాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దూసుకుపోతుంది నిత్యామీనన్.
Advertisement
Advertisement
ఇవాళ తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి నిత్యామీనన్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిత్య మీనన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటించిన కొత్త సినిమా పోస్టర్లు విడుదలయ్యాయి. ఎనిమిదేళ్ల వయస్సులోనే ఓ ఇంగ్లీషు చిత్రం The Monkey Who knew Too much చిత్రంలో టబు చెల్లెలు పాత్రలో కనిపించింది. ఆ తరువాత 2006లో 7ఓక్లాక్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించింది. ఆ తరువాత తెలుగు, కన్నడ, తమిళం, హిందీ సినిమాలలో నటించింది.
Also Read : దర్శకుడి మాటలు వినక అట్టర్ ప్లాప్ అయినా మెగా స్టార్ సినిమా ఏది ? ఎందుకు చిరు వినిపించుకోలేదు ?
తెలుగులో నానితో కలిసి అలా మొదలైంది చిత్రంతో పరిచయమైంది. ఆ తరువాత ఇష్క్, సన్ ఆఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, భీమ్లానాయక్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. హిందీలో కూడా మిషన్ మంగళ్ అనే చిత్రంలో నటించింది నిత్యామీనన్. మరోవైపు నిత్య మంచి సింగర్ కూడా. నిర్మాతగా కూడా సత్తా చాటింది.
Also Read : అప్పట్లో ఎన్టీఆర్ కి సాధ్యమైన రికార్డు మళ్ళీ బాలకృష్ణ సాధించారా ? కేవలం నందమూరి వారికే సొంతం !