Home » ఈరోజుల్లో గోర్లు అస్సలు కత్తిరించరాదు.. కారణమేంటంటే..?

ఈరోజుల్లో గోర్లు అస్సలు కత్తిరించరాదు.. కారణమేంటంటే..?

by Sravanthi
Ad

మన భారతదేశంలో ఏ పని చేయాలన్నా దాన్ని శాస్త్రం ప్రకారం చేస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు . జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేస్తే ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు. ఇప్పటికీ అవే ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు కొంతమంది. ముఖ్యంగా మంగళవారం రోజున హెయిర్ కటింగ్ చేసుకోరాదని, గోర్లు కూడా కత్తిరించుకోకూడదని ఒక ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని పూర్వకాలం నుంచే పాటిస్తూ వస్తున్నారు.. మంగళవారం రోజున గోర్లు ఎందుకు కత్తిరించుకోకూడదు అన్నది ఎవరికి తెలియదు.

also read:శుక్రవారం రోజు ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా..!

Advertisement

మన ఇంట్లో ఉన్న వాళ్లను ఈ ఆచారం గురించి అడిగితే మన పెద్దవాళ్లు పాటిస్తూ వస్తున్నారు మనం కూడా పాటించాలని జవాబు ఇస్తారు. అయితే మంగళవారం రోజున అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహం అధిక వేడిని కలిగి ఉంటుంది. మానవ శరీరంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రక్తాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెబుతుంటారు. ఆరోజున శరీరంపై ఎక్కువ గాయాలవ్వడానికి ఆస్కారం ఉంటుందట.

Advertisement

also read:విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

గాట్లు పడే అవకాశం కూడా ఉంటుందని అందుకే మంగళవారం రోజున హెయిర్ కట్టింగ్,గోర్లు వంటివి కత్తిరించుకోకూడదనే ఆచారం అనాదిగా ఉన్నది. అంతేకాదు ఆదివారం రోజున గోర్లు కత్తిరించుకోకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆదివారం సాక్షాత్తు ఆ నారాయణుడికి అంకితం చేయబడింది కాబట్టి గోళ్లు కత్తిరించడం వల్ల ఆయుష్షూ క్రమంగా తగ్గిపోతుందని నమ్ముతారు. అంతేకాకుండా శనివారం రోజున గోర్లు కత్తిరించినట్లయితే ఇంట్లో గొడవలు జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

also read:అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు

Visitors Are Also Reading