హిందువులు దేవుడి గుడికి వెళుతున్నారంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొబ్బరికాయ దాన్నే టెంకాయ అని కూడా అంటారు. ఇంట్లో పూజ చేసినా లేదంటే గుడికి వెళ్లినా అదే విధంగా దిష్టి తీయడానికి కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. గుడికి వెళ్లి కొబ్బరి కాయలు కొట్టడం వల్ల మనకు ఉన్న అరిష్టాలు అన్ని తొలగిపోతాయి. దేవుడి గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయలు ప్రతిఒక్కరూ కొడతారు కానీ చాలా మంది సరైన పద్దతిలో కొబ్బరికాయలను కొట్టరు. కానీ కొబ్బరి కాయ కొట్టడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
also read : కనుబొమ్మల మధ్యే బొట్టును ఎందుకు పెట్టుకోవాలో తెలుసా?
Advertisement
Advertisement
కొట్టేముందు కొబ్బరికాయను శుభ్రంగా కడగాలి. అంతే కాకుండా కొబ్బరికాయను కొట్టే రాయిని ఆగ్నేయం దిశలో పెట్టాలి. అదే విధంగా కొబ్బరి కాయను కనీసం ఎనిమిది అంగుళాల ఎత్తు నుండి రాయిపై కొట్టాలి. అలా కొడితే కొబ్బరికాయ సరిగ్గా మధ్యలో పగులుతుంది. మధ్యలో కొబ్బరికాయ పగిలితే శుభంగా భావిస్తారు. అంతేకాకుండా పువ్వు వస్తే మంచిదని భావిస్తారు.
ఒకవేళ కొబ్బరికాయ లోపల నల్లగా ఉంటే అరిష్టం అని అలా వచ్చిందంటే శివాయ సమహ అని 108సార్లు జపిస్తే సరిపోతుందని చెబుతారు. ఇక కొబ్బరి కాయ కొట్టిన తరవాత ఆ నీటిని దేవుడికి కూడా ఆరగించాలి. కొంత నీటిని ఒక గిన్నెలో తీసుకుని ప్రసాదంగా ఇవ్వాలి. కొబ్బరి కాయ కొట్టిన వెంటనే దాని వెనకాల ఉండే పీచును తీసివేయాలి. అంతే కాకుండా అందులో నుండి ఒక భాగాన్ని తీసుకుని దానిలో దేవుడి కుంకుమ తో బొట్టు పెట్టి అందులో కాస్త చెక్కర వేసి దేవుడికి నైవేధ్యంగా పెట్టాలి.