అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా Poర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ నోరు మూయించడం కోసం అమెకు భారీగా డబ్బు ఇచ్చినట్టు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో న్యూయార్క్ లోని కోర్టు ఎదుట డొనాల్డ్ ట్రంప్ లొంగిపోయారు. అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా అరెస్టయిన అమెరికా మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించాడు.
Advertisement
Advertisement
డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మ్యాన్ హటన్ డిస్ట్రిక్ అటార్నీ ఆఫీస్ లో పోలీసుల అదుపులో ఉన్నారు. ట్రంప్ రాకతో మ్యాన్ హటన్ డిస్ట్రిక్ అటార్నీ ఆఫీస్ పరిసరాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు భారీ సంఖ్యలో న్యూయార్క్ చేరుకున్నారనే సమాచారం నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా నిరసన ర్యాలీలు చేపట్టకుండా న్యూయార్క్ నగర మేయర్ నగరంలో పలు ఆంక్షలను విధించారు.
వచ్చే ఏడాది జరుగనున్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోమారు అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఎదుట హాజరై తనపై వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని కోర్టుకు విన్నవించుకునే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ మ్యాన్ హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ కి వచ్చి లొంగిపోయినట్టు సమాచారం.