ఐపీఎల్ 2023 లో భారత క్రికెట్ జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. జూన్ లో ఇంగ్లండ్ లో జరుగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ కి టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ దూరం అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అతను అందుకే ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ లో ఆడడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్ సిరీస్ లో అయ్యర్ గాయపడ్డాడు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తన వెబ్ సైట్ నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది. అయ్యర్ గాయం కారణంగా ఆడలేడని పేర్కొంది.
ఐపీఎల్ మధ్యలో అయ్యర్ తిరిగి రావచ్చని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఐపీఎల్ ప్రస్తుత సీజన్ నుంచి కూడా తప్పుకున్నాడు. కోల్ కతా గత ఏడాది అతన్ని కొనుగోలు చేసి కెప్టెన్ గా నియమించింది. ఈ సీజన్ లో అయ్యర్ స్థానంలో నితీష్ రాణా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. శస్త్ర చికిత్స కోసం అయ్యర్ విదేశాలకు వెళ్లనున్నట్టు ఆ నివేదికలో పేర్కొంది. మూడు నెలల పాటు అయ్యర్ ఆటకు దూరంగా ఉండనున్నాడు.
ఇక ఆ తరువాత తన శిక్షణను ప్రారంభిస్తాడు అని పేర్కొంది. గాయం కారణంగా అయ్యర్ బోర్డర్-గవాస్కర్ ట్రోపీ చివరి మ్యాచ్ లో ఆడలేదు. అదేవిధంగా వన్డే సిరీస్ కి దూరమయ్యాడు. గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అయ్యర్ ఆరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు. అప్పుడు భారత టెస్ట్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అందుకే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ లో లేకపోవడం టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఐపీఎల్ అతని స్థానంలో నితీష్ రానా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ ఫైనల్ లో అయ్యర్ స్థానంలో ఫైనల్లో ఎవరు ఆడతారో వేచి చూడాలి.
Also Read : బీరువా కింద ఈ రెండు వస్తువులను పెడితే మీ డబ్బు ఆదా అవ్వడం పక్కా..!