ప్రస్తుతం సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కలిసొస్తే ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. యూట్యూబ్ వీడియోల ద్వారా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న వారి సంఖ్య తక్కువ ఏం కాదు. మహిళలు సైతం యూట్యూబ్ వీడియోలు చేస్తూ కోట్ల సంఖ్యలో సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుంటూ.. కెరీర్ పరంగా ఎదుగుతున్నారు. కచ్చాబాదం సింగర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.
Also Read : మీ భార్యకు ఈ 4 అలవాట్లు ఉంటే.. మీరు మోసపోయినట్టే..!!
Advertisement
ఈ సింగర్ పేరు భూబన్ బద్యాకర్. ఇతను పల్లీలు అమ్మకుంటూ పాడే పాట ఇతన్ని పాపులర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ పాటకు ఏ రేంజ్ లో వ్యూస్ లభించాయో దాదాపు అందరికీ తెలిసింది. సెలబ్రిటీలు సైతం ఈ పాటకు రీల్స్ చేసి రికార్డు స్థాయిలో వ్యూస్ పెంచారు. ఆ పాట వల్ల వచ్చినటువంటి పాపులారిటీని స్టార్ గా మార్చింది. తాను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సింగర్ ఇతరులకు సహాయం చేయడం గమనార్హం.
Advertisement
Also Read : ఈ రాశుల జోడి పెళ్లి చేసుకుంటే..ఇక జీవితం అల్లకల్లోలమే..!!
తాను సంపాదించిన డబ్బులు కరిగిపోవడంతో ఈ సింగర్ కి మళ్లీ పూర్వంలో ఎదుర్కున్న పరిస్థితులు మళ్లీ ఎదురయ్యాయి. ఓ కంపెనీ పత్రాలను చదవకుండా సంతకం చేయడంతో ఈ సింగర్ అప్ లోడ్ చేసిన ప్రతీ వీడియోకి కాపీ రైట్ సమస్య వస్తుంది. ప్రస్తుతం భూబన్ బద్యాకర్ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఈ సింగర్ కి బెంగాలీ సీరియల్ లో ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. తండ్రి పాత్ర షూటింగ్ లో పాల్గొన్న ఇతనికి రూ.40వేలు పారితోషికం అందుకున్నారు. సీరియల్ సక్సెస్ సాధిస్తే మాత్రం భూబన్ బద్యాకర్ కి ఇక తిరుగు ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. భూబన్ బద్యాకర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని, సీరియల్స్ నిర్మాతలు కూడా ఈ సింగర్ కి ఆపర్లను ఎక్కువ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : పెళ్లి అయిన పదేళ్లకు ప్రెగ్నేంట్ కావడానికి అసలు కారణం చెప్పిన ఉపాసన..!