టెక్నాలజీని అందిపుచ్చుకొని లక్షల జీతాల ఉద్యోగాలను సంపాదించుకొని రెక్కలు కట్టి నగరాలకు వలస వెళ్లి అక్కడే సెటిలైన చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కరోనా పుణ్యమా అని తిరిగి సొంత గ్రామాలకు చేరుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంటినుంచే పనులు చక్కబెట్టుకుంటున్నారు.
కొందరు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటి వద్దనే ఉంటే, మాధవరెడ్డి వంటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొత్తగా ఆలోచించి రైతులుగా మారుతున్నారు. ఆఫీస్ సమయంలో ఆ వర్క్ చేస్తూ, ఉదయం, సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో పనులు చేస్తున్నారు. సూర్యపేట జిల్లాలోకి ఆత్మకూరుకు చెందిన మాధవరెడ్డి తన కుటుంబానికి చెందిన 10 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంట వేశాడు. అయితే, సాధారణ వరి కాకుండా బ్లాక్ రైస్‌ను పండించాలని నిర్ణయం తీసుకొని, ఆ వరి విత్తలనాలను తీసుకొచ్చి పాగు చేశారు. సాధారణ రకం వరి కంటే బ్లాక్ రైస్ అధికమొత్తంలో దిగుబడి వచ్చింది. పైగా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ రకం రైస్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో, తన పొలంలోనే కాకుండా గ్రామంలోని కొంతమంది రైతులకు బ్లాక్ రైస్ విత్తనాలను పంచిపెట్టారు. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా, రైతుగా పొలంలో పంట పండించడంలో ఆనందం ఉందని, కరోనా మహమ్మారి తనకు నిజమైన జీవితాన్ని ఇచ్చిందని మాధవరెడ్డి చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయిలో రైతుగా మారాలనే ఆలోచన ఉన్నట్టుగా మాధవరెడ్డి పేర్కొన్నారు.
Advertisement