యంగ్ హీరో విశ్వక్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ రూపొందించినటువంటి సినిమా దాస్ కా ధమ్కీ. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఎందుకు అంటే..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరవ్వడమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ ఎన్టీఆర్ అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఎప్పుడూ లేనిది ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడం వెనుక పెద్ద కథనే ఉన్నదని ఫిలిం వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
Advertisement
ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ప్రారంభం అవ్వాల్సిన సినిమా ఆరంభంలోనే వివాదాల్లో చిక్కుకొన్న విషయం తెలిసిందే. ఆ సినిమా అటకెక్కడానికి పరోక్షంగా ఎన్టీఆర్ కారణం అని టాక్ వినిపిస్తోంది. అర్జున్-విశ్వక్ సేన్ సినిమా సమయంలో ఎన్టీఆర్ పలుమార్లు విశ్వక్ సేన్ ని ప్రయివేటు పార్టీలకు పిలిచినట్టు సమాచారం. ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో విశ్వక్ ఆ సినిమాను పక్కకు పెట్టాడు. పార్టీలకు వెళ్లడం అర్జున్ కి ఏమాత్రం నచ్చలేదని, పలుమార్లు సినిమా షెడ్యూల్ ని పోస్ట్ ఫోన్ చేసినప్పటికీ విశ్వక్ తీరు మారకపోవడంతో సినిమాను ఆపేసినట్టు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Advertisement
Also Read : ‘దసరా’ మూవీ పై మహేష్ ట్వీట్.. అందుకోసమేనా ?
తన వల్లనే విశ్వక్ సేన్ సినిమా ఆగిపోయిందని తెలుసుకున్న ఎన్టీఆర్ దాస్ కా దమ్కీ సినిమా విడుదలవ్వడంతో ఆస్కార్ వేడుక నుంచి మధ్యలోనే హైదరాబాద్ బయలు దేరి వచ్చాడు. తన వల్ల జరిగినటువంటి తప్పునకు ప్రాయచిత్తంగా విశ్వక్ సేన్ కి మద్దతుగా దాస్ కా ధమ్కీ ప్రీ రీలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ హాజరైనట్టు తెలుస్తుంది. కానీ అర్జున్, విశ్వక్ సేన్ సినిమా ఆగిపోవడానికి అర్జున్ చెప్పిన కారణాలు వేరేలా ఉన్నాయి. ప్రధానంగా కథ విషయంలో తల దూర్చే వాడని, విశ్వక్ ప్రవర్తన వల్ల షెడ్యూల్ డిస్టర్బ్ అయ్యేదని వెల్లడించారు. వీటిలో ఏది వాస్తవం అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read : దసరా సినిమా కథను ఆ సూపర్ హిట్ చిత్రం నుండి లేపేశారా..? ఆ సినిమా ఏదంటే ..!