Home » ద‌స‌రా సినిమా క‌థ‌ను ఆ సూప‌ర్ హిట్ చిత్రం నుండి లేపేశారా..? ఆ సినిమా ఏదంటే ..!

ద‌స‌రా సినిమా క‌థ‌ను ఆ సూప‌ర్ హిట్ చిత్రం నుండి లేపేశారా..? ఆ సినిమా ఏదంటే ..!

by AJAY
Ad

నాని హీరోగా న‌టించిన ద‌స‌రా సినిమా విడద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. ఇక సినిమా విడుద‌ల‌కు ముందే పాట‌ల‌కు మరియు ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో సినిమా పై అంచ‌నాలు భారీగా పెర‌గ్గా ఆ అంచ‌నాల‌ను ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల రీచ్ అయ్యాడు. ద‌ర్శ‌కుడికి ఇదే డెబ్యూ సినిమా అయిన‌ప్ప‌టికీ త‌న టాలెంట్ తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ALSO READ : రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ‌త్త పాత్ర‌ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

Advertisement

సినిమాలోని యాక్ష‌న్ సీన్ లు..ట్విస్ట్ లు మ‌రియు క్లైమాక్స్ ఫైట్ ఇలా ప్ర‌తి ఒక్క‌టీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. అయితే శ్రీకాంత్ ఓదెల సుకుమార్ శిష్యుడు అన్న సంగ‌తి తెలిసిందే. దాంతో సుకుమార్ ప్ర‌భావం ద‌ర్శకుడి పై ప‌డిందని కొంత‌మంది ప్రేక్షకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

అంతే కాకుండా ద‌స‌రా సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాల‌ను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని చేసి ఉంటాడ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన ఆర్య 2 ఎంతటి విజ‌యం సాధించిందో తెలిసిందే. అయితే ఈ కాన్సెప్ట్ తో నే ద‌స‌రా సినిమా కూడా తెర‌కెక్కింద‌ని టాక్. అంతే కాకుండా కొన్ని సీన్ ల‌లో రంగ‌స్థ‌లం సినిమా కూడా గుర్తుకువ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ఇక ఆ విష‌యం ప‌క్క‌న పెడితే సినిమా మాత్ర ఖ‌చ్చితంగా థియేట‌ర్ లో చూడాల‌ని అంటున్నారు. సినిమాలోని ఎమోష‌న్స్ మ‌రియు యాక్ష‌న్ సీన్ లు ప్రేక్షకుడికి కొత్త అనుభ‌వాన్ని ఇచ్చాయ‌ని చెబుతున్నారు. ఇక మ‌రికొంద‌రు నెటిజ‌న్ లు సినిమా అంటే క‌థ‌లు ఎక్క‌డి నుండో రావ‌ని ప్ర‌తి సినిమాను ఓ సినిమా ను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని చేస్తార‌ని అంటున్నారు. సినిమాను క‌థ అని స‌పరేట్ గా చూడ‌కుండా మెప్పించిందా లేదా అని మాత్ర‌మే చూడాల‌ని చెబుతున్నారు.

ALSO READ :ఫస్ట్ సినిమాతోనే సక్సెస్.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంతకు ముందు ఏం చేశాడు ? 

Visitors Are Also Reading