అహ్మదాబాద్ వేదికగా గుజరాత్-చెన్నై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో తోలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఋతురాజ్ బ్యాటింగ్ చూస్తే ఈజీగా 200 దాటేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ చివర్లో బ్యాటర్లు పరుగులు చేయకపోవడంతో ఈ స్కోరుకు పరిమితమైంది. ఇక గుజరాత్ ఇన్నింగ్స్ స్టార్ట్ కావడానికి ముందు తుషారే దేశ్ పాండేని అంబటి రాయుడికి బదులు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపింది.
READ ALSO : బ్లాక్ ద్రాక్ష… గ్రీన్ ద్రాక్ష… ఏది మేలు? వీటిని తింటే ఏమవుతుంది!
Advertisement
కానీ చెన్నై ఓటమికి కారణం అయ్యాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేదనలో ఏ జట్టు అయినా సరే ప్రత్యర్థిని కట్టడి చేయాల్సి ఉంటుంది. తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తుషార్ మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేశాడు. 3.2 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు ఇచ్చేశాడు.
Advertisement
READ ALSO : ఆ హీరోయిన్ తో నాగ చైతన్య రిలేషన్…ఇలా అడ్డంగా దొరికిపోయారుగా!
తొలి మ్యాచ్ లోనే సీఎస్కే ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీసన్ అయ్యాడు. దీంతో అతడిని చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో తుషార్ తో పాటు పలువురు చెన్నై బౌలర్లు నో బాల్స్ వేయడం కూడా ఓటమికి ఓ కారణం అని స్వయంగా ధోనినే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్ ని ఉపయోగించుకున్న చెన్నై జట్టు మ్యాచ్ లో గెలవడానికి బదులు అతడి వల్లే ఓడిపోయిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
READ ALSO : TS EAMCET 2023 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… మారిన ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీలు… కొత్త డేట్స్ ఇవే!