ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన భారీ సిక్సర్ ను అడ్డుకునే ప్రయత్నంలో కేన్ మామ కాలుకి గాయమైంది.
READ ALSO : బ్లాక్ ద్రాక్ష… గ్రీన్ ద్రాక్ష… ఏది మేలు? వీటిని తింటే ఏమవుతుంది!
Advertisement
నొప్పితో విలవిలలాడిన కేన్ మామ ఫిజియో సాయంతో కుంటుతూ మైదానం వీడాడు. అతని గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది. జోషువా లిటిల్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని రుతురాజు గైక్వాడ్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ కొట్టగా, ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న కేన్ మామ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు.
Advertisement
READ ALSO : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు!
బౌండరీ లైన్ దాటే క్రమంలో బంతిని లోపలికి విసిరేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక కాలిపైనే ల్యాండ్ అవ్వడం, అది స్లిప్ అవడంతో అలానే కుప్పకూలిపోయాడు. ఆ బంతి కాస్త బౌండరీ లైన్ ను దాటింది. కేన్ మామ సిక్సర్ కాస్త బౌండరీగా మారినా, అతను తీవ్రంగా గాయపడ్డాడు.
READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!