ఆసియా కప్ విజేత శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక ఓటమిపాలైంది. హామిల్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలవగా, రెండో వన్డే వర్షార్పణం అయింది. ఇక కీలకమైన మూడో వన్డేలో ఓడిన లంక సిరీస్ కోల్పోవడంతో పాటు ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
READ ALSO : ఆ హీరోయిన్ తో నాగ చైతన్య రిలేషన్…ఇలా అడ్డంగా దొరికిపోయారుగా!
Advertisement
ఈ ఓటమితో లంక నేరుగా వన్డే వరల్డ్ కప్ కు క్వాలిఫై అయ్యే అవకాశం చేజార్చుకుంది. ఇక జూన్ లో జింబాబ్వే వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో లంక పాల్గొంటుంది. అక్కడ గెలిచే మ్యాచ్ ఫలితాలను బట్టి వరల్డ్ కప్ అర్హతకు అవకాశం ఉంటుంది. పొరపాటున క్వాలిఫైయర్స్ లో గనుక ఓడిపోతే లంక వన్డే వరల్డ్ కప్ కథ ముగిసినట్లే. అయితే ఇలా జరగడం 44 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.
Advertisement
ఇక వన్డే వరల్డ్ కప్ ఆతిథ్యం ఇవ్వనున్న భారత సహా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లో నేరుగా ప్రపంచకప్ కు అర్హత సాధించాయి. ఇక శ్రీలంక రేసు నుంచి అవుట్ అయింది. దీంతో జూన్ లో వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ టోర్ని ఆడాల్సి ఉంటుంది అందులో. టాప్ 3 లో నిలిచిన జట్లు వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్-నవంబర్ లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనుంది.
READ ALSO : IPL 2023 : షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వార్.. !