Home » పెళ్లి త‌ర‌వాత వేగంగా బ‌రువు ఎందుకు పెరుగుతారో తెలుసా..? 3 కార‌ణాలు ఇవే..!

పెళ్లి త‌ర‌వాత వేగంగా బ‌రువు ఎందుకు పెరుగుతారో తెలుసా..? 3 కార‌ణాలు ఇవే..!

by AJAY
Published: Last Updated on
Ad

పెళ్లికి ముందు పెళ్లి త‌ర‌వాత జీవితం ఒకేలా ఉండ‌దు. జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మాన‌సికంగానే కాకుండా శారీర‌కంగానూ పెళ్లి త‌ర‌వాత మార్పులు చోటు చేసుకుంటాయి. దాదాపు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి త‌ర‌వాత బ‌రువు పెరిగిపోతూ ఉంటారు. ఇక చుట్టుపక్క‌ల వాళ్లు కూడా పెళ్లైతే లావు అవుతాడేమో…లావు అవుతుందేమో అంటూ కామెంట్ లు చేయ‌డం కూడా వినే ఉంటాం.

ALSO READ : సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట.. ఆ హీరో సలహా మేరకేనా?

Advertisement

అయితే అస‌లు పెళ్లి త‌ర‌వాత అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు బవురు వేగంగా పెరుగుతారు. అస‌లు కారణాలు ఏంటి అన్న‌ది ఇప్పుడు చూద్దాం…పెళ్లికి ముందు ఎవ‌రైనా అందంగా క‌నిపించాల‌ని అనుకుంటారు. కాబ‌ట్టి డైట్ లో ఉండ‌టం వ్యాయామం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బ‌రువు పెరుగుతున్నామ‌ని తెలిస్తే తిన‌డం కూడా త‌గ్గించేస్తారు.

Advertisement

అయితే పెళ్లి త‌ర‌వాత అందం పై ఆస‌క్తి పోతుంది. సంపాద‌న పై ఆస‌క్తి పెరుగుతుంది. కాబ‌ట్టి బ్యూటీ పై కేర్ తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల వేగంగా బ‌రువు పెరుగుతారు. అంతే కాకుండా పెళ్లి త‌ర‌వాత దాదాపు సంతోషంగానే ఉంటారు. సంతోషంగా ఉన్న‌వాళ్లు కాస్త ఎక్కువ‌గానే తింటూ ఉంటారు.

ఆ కార‌ణం వ‌ల్ల కూడా బ‌రువు వేగంగా పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే పెళ్లి త‌ర‌వాత బంధువులు నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక అలా బంధువ ఇళ్ల‌కు వెళ్ల‌డం..ఎక్కువ‌గా వేడుక‌ల‌కు వెళ్ల‌డం అక్క‌డ న‌చ్చింది క‌డుపునిండా తిన‌డం వ‌ల్ల కూడా బ‌రువు వేగంగా పెరిగే అవ‌కాశం ఉంది.

ALSO READ : భారతీయులు ఇప్పటికీ ఇష్టపడే 5 అద్భుత బైక్స్.. ఏవో తెలుసా ..?

Visitors Are Also Reading