ఏ దేశంలో చూసిన వాలీబాల్ క్రీడాకారుల తర్వాత క్రికెట్ క్రీడాకారులకు ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. ఇందులో ముఖ్యంగా స్టార్ క్రికెటర్ల గురించి ఎలాంటి వార్తలు వచ్చినా తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి. కొంతమంది వారి అభిమాన క్రీడాకారుల గురించి తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంటారు.. అలాంటి ఇండియన్ క్రికెటర్లలో స్టార్ క్రికెటర్ గా పేరుపొందిన సచిన్,ధోని మరియు ఇతర క్రికెటర్ల విద్యార్హతలు ఇప్పుడు తెలుసుకుందాం..
also read:Mar 31st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!
Advertisement
క్రికెట్ దేవుడైన సచిన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన పేరు పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. స్టార్ క్రికెటర్ గా ఎదిగిన సచిన్ చదువులో మాత్రమే వెనకబడిపోయారు. క్రికెట్ పై ఉన్న మక్కువతో సచిన్ 16వ ఏటనే చదువు మానేశాడు. కనీసం టెన్త్ కూడా పాస్ కాలేకే పోయారు. ఇండియా క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారు ఉండరు. ఈయన సారథ్యంలో క్రికెట్ టీమ్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. క్రికెట్ లో రికార్డు క్రియేట్ చేసిన ఆయన 12 తరగతి మాత్రమే పూర్తి చేశారు.
Advertisement
also read:IPL 2023 : కెప్టెన్సీ మీట్ కు రోహిత్ దూరం… ఐపీఎల్ కు దూరం కానున్నాడా ?
ఇక మరో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ పేరిట కూడా ఎన్నో రికార్డులు ఉన్నాయి. సచిన్ తర్వాత స్థాయి ఆయనది అని చెప్పవచ్చు. ఈయన కూడా 12వ తరగతి వరకే చదివారు. మరో స్టార్ క్రికెట్ శిఖర్ ధావన్ కూడా 12వ తరగతి పూర్తి చేశారు. ఇక ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. త్వరలో ఈ ఆటగాడికి భారత జట్టు కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. క్రికెట్ లో ఎంతో పేరు సంపాదించుకున్న ఈ స్టార్ క్రికెటర్ కేవలం 9వ తరగతి మాత్రమే పాస్ అయ్యారట. ఈ విధంగా క్రికెట్ దేవుళ్లు అయిన వీరు చదువులో మాత్రం వెనకబడిపోయారని చెప్పవచ్చు.
also read:‘రంగస్థలం’ మూవీకీ, ‘దసరా’కి మధ్య సరికొత్త సంబంధం.. నాని ఖాతాలో రికార్డుల మోతే..!!