Home » “బలగం” సినిమాకు దక్కిన అరుదైన గౌరవం..ఊరంతా కలిసి ఏం చేశారంటే..?

“బలగం” సినిమాకు దక్కిన అరుదైన గౌరవం..ఊరంతా కలిసి ఏం చేశారంటే..?

by Sravanthi Pandrala Pandrala

గ్రామీణ నేపథ్యం కలిగిన ప్రతి ఒక్కరు ‘బలగం’ సినిమా తప్పనిసరి చూడాల్సిందే. ఈ సినిమా అంటే సినిమా కాదు.. పల్లెటూరులో ఉండే ఒక కుటుంబ నేపథ్యానికి సంబంధించిన కష్టం, సుఖం, బాధలు, బంధాలు అన్ని కలగలిపింది ఈ బలగం. గ్రామీణ నేపథ్యమున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.. చాలామంది వారి వారి జీవితాలకు, కుటుంబాలకు ఈ సినిమాను ఆపాదించుకుంటున్నారు.. వారి తోబుట్టులను గుర్తుతెచ్చుకొని బావొద్వేగానికి గురవుతున్నారు.. పూర్వకాలంలో అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఎలాంటి బాధ వచ్చిన అందరూ కలిసి పంచుకునేవారు. కానీ ప్రాత్యాత్య సంస్కృతిలో ఈ బంధాలన్నీ మసకబారిపోయాయి.. ఉద్యోగరీత్యా, వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిపోతున్నారు..

also read:Sr:NTR చివరి కోరిక.. ఓ ఇంటర్వ్యూలో హరికృష్ణ బయట పెట్టారుగా..!!

also read:పాన్ ఇండియాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్ట‌బోతున్న‌ చ‌ర‌ణ్ బ‌న్నీ…చివ‌రికి గెలిచేదెవ‌రు..?

ఆస్తిపాస్తుల విషయాల్లో ఒక్క తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే కొట్టుకొని చస్తున్నారు.. కొంతమంది విదేశాలకు వెళ్లి కనీసం తల్లిదండ్రులను కడసారి చూసేందుకు కూడా రావడం లేదు. అలాంటి నేపథ్యంలో మన సంస్కృతి సంప్రదాయాన్ని మరుస్తున్న మనకు దర్శకుడు వేణు గుర్తొచ్చేలా చేశాడు.. కమర్షియల్ సినిమాల ఊబిలో చిక్కుకున్న మనల్ని బయటపడేసాడని చెప్పవచ్చు.. కనీసం రెండు కోట్లు బడ్జెట్ కూడా లేని ఈ సినిమా కోట్లాదిమంది ప్రజలకు కనెక్ట్ అవుతోంది. దూర దేశాలలో ఉన్న కొంతమంది వారి కుటుంబాలను గుర్తు తెచ్చుకొని కన్నీరు పెట్టుకునేలా చేస్తోంది ఈ చిత్రం.. రిలీజ్ 25 రోజులు దాటిన ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతోంది..

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0Gvc6Ai43pKu4wKaMAg65XZNPdrgdiQexTwEEUafWiukCd4V987QDWQ2dUByEEy8kl&id=100002305148502&sfnsn=wiwspwa

ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమాను నిజాంబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఆశ కొత్తూరు గ్రామ ప్రజలు అంతా కలిసి ఒక చౌరస్తా వద్ద గుమికూడి సినిమాను తిలకించారు.. ఈ విధంగా ప్రతి పల్లెను బలగం తాకింది. పల్లె పల్లెల్లో కూడలిల వద్ద పెద్దపెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకొని అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని చూస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి బలగం మళ్లీ వస్తుందో రాదో తెలియదు కానీ , దిల్ రాజ్ చరిత్రలో వేణు ఎలదండి కెరియర్ లో ఇటువంటి సినిమా మరోసారి వచ్చినా కానీ ఇంతటి రెస్పాన్స్ వస్తుందో రాదో తెలియదు అంటూ చాలామంది ప్రజలు చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ, విడిపోయిన వారి బంధుత్వాలను నెమరు వేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం చూడని వారు ఎవరైనా ఉంటే బలగం చూసేయండి..

also read:Mar 29th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading