ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్స్ లలో ఒకరైన స్టీవ్ స్మిత్ ఈసారి ఐపీఎల్ 2023లో విభిన్నమైన శైలిలో కనిపించబోతున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. సరికొత్త అవతారం స్టీవ్ ఐపీఎల్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 2023 ఐపీఎల్ లో స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించబోతున్నాడు. ఐపీఎల్ లో 103 మ్యాచ్ లు ఆడిన ఈ ఆటగాడు ఇప్పుడు తన స్వరం వినిపించనున్నారు. స్టీవ్ స్మిత్ ఎన్ని మ్యాచ్ లకు వ్యాఖ్యానిస్తాడో ప్రస్తుతానికి అయితే స్పష్టంగా తెలియదు.
Also Read : ఇక్కడ ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును..!
Advertisement
చివరిసారిగా స్టీవ్ స్మిత్ 2021లో ఐపీఎల్ ఆడాడు. గత ఏడాది ఈ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అదే సమయంలో అతను ఐపీఎల్ అతను ఐపీఎల్ 2023 వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. స్టీవ్ స్మిత్ రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ కి కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ధోని లాంటి ఆటగాడు స్మిత్ కెప్టెన్సీలో ఆడాడు. స్మిత్ తన ఐపీఎల్ కెరీర్ లో 34.51 సగటుతో 2485 పరుగులు చేశాడు. ఇందులో అతను ఒక సెంచరీ కలిగి ఉన్నాడు.
Advertisement
Also Read : ఐపీఎల్ కోసం రంగంలోకి బాలయ్య.. ఇక దబిడిదిబిడే
అతని స్ట్రైక్ రేట్ 128 నిలిచింది. స్టీవ్ స్మిత్ ఐపీఎల్ 2023లో ఆడనప్పటికీ ఈ టోర్నమెంట్ లో అతని దేశానికి చెందిన చాలా మంది కీలక ఆటగాళ్లు కనిపించను్నారు. డేవిడ్ వార్నర్ వంటి కీలక ఆటగాడు ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ వంటి కీలక ఆటగాళ్ల స్టామినా కనిపిస్తుంది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ లో ఈ సారి టైటిల్ ని ఏ జట్టు వరిస్తుందో వేచి చూడాలి.
Also Read : ఈ ఐదుగురు ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్.. వారు ఎవ్వరంటే..?