Home » రనౌట్ అయినా నాటౌట్ ఇచ్చిన అంఫైర్.. అసలు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

రనౌట్ అయినా నాటౌట్ ఇచ్చిన అంఫైర్.. అసలు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా క్రికెట్ లో చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మనం తరచూ ఏదో ఒక విచిత్రం గురించి చూస్తూనే ఉంటాం. ఆటగాళ్లు తప్పిదమో, లేక ఎంఫైర్ ఇలా ఏదో ఒక రీతిలో కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫస్ట్ వన్డేలో ఓ విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. దీని గురించి వింటే మీరు ఆశ్చర్యపోక అస్సలు ఉండరు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రోకు శ్రీలంక బ్యాట్స్ మెన్ ఔట్ అయ్యాడు. క్లియర్ గా ఔట్ అని రిప్లేలో సైతం కనిపిస్తోంది. కానీ అంఫైర్ దానిని ఔట్ గా ప్రకటించలేదు. ఎందుకంటే ఇక్కడే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.  ఆ సంఘటన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  IPL 2023 : టైటిల్ రేసులో నాలుగు జట్లు… వీటిలో ఒక జట్టుకే కప్పు గెలిచే ఛాన్స్…ఏవంటే?

Advertisement

న్యూజిలాండ్- శ్రీలంక మధ్య తొలి వన్డే మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో లంకను చిత్తు చేసింది కివీస్ జట్టు. 198 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 274 పరుగులు చేయగా.. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది శ్రీలంక. అయితే కీవిస్ ఫేసర్ల దాటికి 76 పరుగులకే కుప్ప కూలింది లంక జట్టు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షీప్లి 5 వికెట్లతో లంక పతాన్ని శాసించాడు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఈ మ్యాచ్ లో జరిగినటువంటి విచిత్ర సంఘటన  గురించి  తెలుసుకుందాం. శ్రీలంక టీమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ లో బ్లెయిర్ టిక్నర్ వేసిన 4వ బంతిని లంక బ్యాటర్ కరుణరత్నే ఆడాడు. సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. 

Advertisement

Also Read :  IPL 2023 : KKR కెప్టెన్ గా సునీల్ నరైన్… అయ్యర్ పై వేటు!

 

ఈ నేపథ్యంలోనే బంతిని వెంటనే అందుకున్నటువంటి కివీస్ ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ వైపునకు త్రో చేశాడు. ఇక వెంటనే బంతిని అందుకొని టిక్నర్ స్టంప్స్  పడగొట్టాడు. దీంతో ఫీల్డ్ అంఫైర్ థర్డ్ ఎంఫైర్ కి రిఫర్ చేశాడు. అయితే టిక్నర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి కరుణరత్నే క్రీజుకు కొద్ది దూరంలో ఉండడంతో అతను ఔట్ అయినట్టు అందరూ భావించారు. కానీ ఇక్కడే ఒక  ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతి బెయిల్స్ కి తగలగానే వెంటనే జింగ్ బెయిల్స్ వెలగలేదు. దీంతో రూల్స్ ప్రకారం.. జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా థర్డ్ ఎంఫైర్ నాటౌట్ అయినట్టు ప్రకటించాడు. అసలు విషయం ఏంటంటే..? ఆ బెయిల్స్ తో ఛార్జింగ్ లేదట. దీంతో కివీస్ ఆటగాళ్లు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read :  రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం..!

Visitors Are Also Reading