దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం సూపర్ హిట్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి. మరోవైపు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి నాటు నాటు పాట కూడా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మారు మ్రోగిపోతుంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే తరువాత చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Also Read : రమ్యకృష్ణ గురించి దర్శకుడు కృష్ణవంశీ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోక ఉండరు..!
Advertisement
ఇదిలా ఉంటే.. సీనియర్ నటి కాంచన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాహుబలి సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం తనను సంప్రదించిన రాజమౌళి రెమ్యునరేషన్ విషయంలో తక్కువ చేసి మాట్లాడారని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అసలు ఏం చెప్పిందంటే.. బాహుబలి సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం రాజమౌళి తనను సంప్రదించారని, కానీ డబ్బులు ఇవ్వడానికి చాలా ఆలోచించారని చెప్పారు. ఆయనకు లేని డబ్బులా ? అని కూడ ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. తమ లాంటి వారికి ఇస్తే ఎన్నో సేవలు చేసుకుంటాం కదా, ఎందుకు బాధపడతారో తెలియదు అని కామెంట్ చేశారు.
Advertisement
Also Read : అల్లరి నరేష్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా ?
రెండు రోజుల డేట్స్ కోసం తాను రూ.5లక్షలు అడిగితే రాజమౌళి చాలా ఎక్కువ అన్నారని చెప్పారు. ఆ తరువాత తాను కూడా సైలెంట్ గా ఉండిపోయానని చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాలో హీరో ఓల్డ్ క్యారెక్టర్ కు హీరోయిన్ గా అడిగారని గుర్తు చేసుకున్నారు. ఈ విషయంలో తాను ఏమి క్రిటిసైజ్ చేయలేదని.. ఓల్డ్ ఆర్టిస్ట్ ల పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. రాజమౌళికి గతంలో దివంగత నటి శ్రీదేవి విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బాహుబలి కోసం ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read : రెండో పెళ్లికి రెడీ అయిపోయిన నిహారిక…?