పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం. పెళ్లి తర్వాత చాలామంది జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత కొంతమంది అమ్మాయిలు విపరీతమైన లావెక్కుతారు.. ఇలా లావు ఎక్కడానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు..
Advertisement
మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక అధ్యయనం ప్రకారం పెళ్లయిన 5 ఏళ్ల లోపు 82 శాతం మంది జంటలు ఐదు నుంచి పది కిలోల వరకు బరువు పెరుగుతారట. ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉంటారని నిపుణులు అంటున్నారు. బరువు ఎక్కడానికి కారణాలేంటో చూసేద్దామా..
also read:పవన్ కళ్యాణ్ బాలు సినిమాను కాపీ కొట్టి హిట్ కొట్టిన హీరో ఎవరో తెలుసా ?
పెళ్లి సంప్రదాయాలు :
పెళ్లికి ముందు చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు వివిధ రకాల వర్కౌట్లు చేస్తూ శరీరాన్ని కాపాడుకుంటారు. ఇక పెళ్లి ప్రక్రియ మొదలైన తర్వాత ఈ తంతు చాలా రోజుల వరకు సాగుతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడు రోజులు ఉంటాయి. ఈ టైంలో చాలామంది తినడం, త్రాగడం వంటివి ఎక్కువ చేసి వ్యాయామం చేయడం మరిచిపోతారు దీనివల్ల కొవ్వు పెరిగి బరువెక్కుతారు.
Advertisement
also read:Vishwaksen: దాస్ ఆ తమిళ బ్యూటీ మాయలో పడిపోయారా..?
కొవ్వు పదార్థాలు తినడం:
చాలామంది వివాహ వేడుకల్లో తినే ఆహారం మరియు నూనె, మసాలాలు,పంచదార మైదా వంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి రోజులపాటు కంటిన్యూగా వాడడం వల్ల కొవ్వు పెరిగి లావు అవుతారు.
నిద్ర లేకపోవడం :
ఇక పెళ్లి టైంలో ఇంటికి చుట్టాలు రావడం, దీంతోపాటు ఇతర ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఈ కారణాల వల్ల కొత్తజంట చాలా వరకు అలసిపోయి నిద్రకు పూర్తిగా భంగం కలిగి, ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడి ఉబ్బినట్లు కనిపిస్తారు.
హార్మోన్ల మార్పు :
పెళ్లి తర్వాత చాలామంది సె* లో పాల్గొనడం వల్ల వారి శరీర హార్మోన్ల మార్పులు వస్తాయి. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే బరువు పెరగడానికి కారణం కావచ్చు.
మానసిక పరిస్థితి:
కొంతమంది మహిళలు వివాహం తర్వాత ఆందోళన, మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీరు ఎప్పుడూ ఏదో ఒక దానిపై నిమగ్నమై ఉంటారు . దీనివల్ల మానసికంగానే కాకుండా, శారీరకంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల రోజులు గడుస్తున్న కొద్ది బరువు పెరిగి ఉబకాయం పెరిగే అవకాశం ఉంటుంది.
also read:అలాంటి పనులు చేసి మా నాన్నను చాలా ఇబ్బంది పెట్టా.. మంచు మనోజ్ ఎమోషనల్..!!