దేశంలో నోట్ల రద్దు అయినప్పటి నుంచి ఏదో ఒక మ్యాటర్ నోట్ల విషయంలో వస్తూనే ఉంది. ఈ తరుణంలో తాజాగా 2000 నోట్లకి సంబంధించి కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేస్తోంది. ఏటీఎంలో ₹2,000 నోట్లను నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా తెలియజేశారు.. భారతీయ రిజర్వు బ్యాంక్ వార్షిక నివేదికల ప్రకారం.. 2000, 500 నోట్లు మొత్తం విలువ 2017 మార్చి నాటికి రూపాయలు 9.512 లక్షల కోట్లు..
Advertisement
Also read:ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?
అదే 2022 మార్చి చివరి నాటికి రూపాయలు 27.057 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి తెలియజేసింది. ఏటీఎంలో 2000 నోట్ల రూపాయలు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టలేదని చెప్పింది. వారి యొక్క కస్టమర్ల అవసరాల ఆధారంగా సమయాన్ని బట్టి బ్యాంకులో అంచనా వేసి ఏటీఎంలో నింపుతాయని వివరించారు. అయితే ఈ మధ్యకాలంలో 2000 నోట్ల రూపాయల సర్కులేషన్ చాలావరకు తగ్గింది.
Advertisement
Also read:కృష్ణవంశీ,రమ్యకృష్ణల కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
పలు కారణాలవల్ల ఈ నోట్ల సర్కులేషన్ తగ్గించేసినట్లు తెలుస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క 2000 నోట్లను కూడా ప్రింట్ చేయలేదు. ఏటీఎంలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019లో 2000 నోట్ల ప్రింటింగ్ ఆపేసినట్టు ఆర్బిఐ ఈ మధ్యకాలంలో తెలిపింది. మరి అంతకు ముందు ప్రింట్ అయినటువంటి రూపాయలు ఏమయ్యాయన్నది ప్రస్తుతం అందరి మెదళ్లలో ఉన్న ప్రశ్న..
Also read:దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!