Home » భార్య కంటే భ‌ర్త వ‌య‌సులో ఎందుకు పెద్ద‌వాడై ఉండాలి..? శాస్త్రం ఏం చెబుతుందంటే..?

భార్య కంటే భ‌ర్త వ‌య‌సులో ఎందుకు పెద్ద‌వాడై ఉండాలి..? శాస్త్రం ఏం చెబుతుందంటే..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం చాలామంది ఏజ్ ను ప‌ట్టించుకోకుండా వివాహాలు చేసుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి కంటే వ‌య‌సులో పెద్ద‌ది అయినా ప‌ట్టించుకోవ‌డం లేదు. సెల‌బ్రెటీలు మాత్ర‌మే కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా అలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఒక‌ప్పుడు మాత్రం పెళ్లి చేయాలంటే క‌చ్చితంగా అమ్మాయి కంటే అబ్బాయి వ‌య‌సులో పెద్ద‌వాడు అయ్యుండాలి.

Advertisement

కాగా శాస్త్రం కూడా అబ్బాయి క‌చ్చితంగా అమ్మాయి కంటే వ‌య‌సులో పెద్ద‌వాడు అయ్యి ఉండాలని చెబుతోంది. అంతే కాకుండా పెళ్లి చేసుకునే స్త్రీ పురుషుల మ‌ధ్య వ్య‌త్యాసం క‌చ్చితంగా క‌నీసం నాలుగేళ్లు అయినా ఉండాలటని శాస్త్రం చెబుతోంది. సాధార‌ణంగా స్త్రీల కంటే పురుషులు ఆల‌స్యంగా ప‌రిప‌క్వ‌త చెందుతారు. శారీర‌కంగా స్త్రీలు ముందుగా ప‌రిప‌క్వ‌త చెందుతారు.

ALSO READ : వైజాగ్ ODIలో భారత్‌‌కి అవమానకర ఓటమి.. ఆస్ట్రేలియా ఓపెనర్లే దంచేశారు

Advertisement

ఇక పురుషులు కాస్త ఆల‌స్యంగా ప‌రిప‌క్వ‌త చెందుతారు. కేవ‌లం శారీర‌కంగానే కాకుండా మానసికంగా కూడా స్త్రీలు ముందుగా ప‌రిప‌క్వ‌త చెందుతారు. అదేవిధంగా పురుషుడి కంటే స్త్రీ నాలుగేళ్లు ముందుగా ముస‌లిత‌నం వ‌స్తుంది. కాబ‌ట్టి ఒకే వ‌య‌సు వాళ్లు పెళ్లి చేసుకుంటే స్త్రీకి ముందుగానే వృద్దాప్యం వ‌స్తే భ‌ర్త ఆమెకు సేవలు చేయ‌లేడు.

అదే విధంగా పురుషుడి కంటే స్త్రీల‌కు స‌హ‌నం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక భ‌ర్త కంటే భార్య వ‌య‌సులో చిన్న‌ది అయితేనే ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌లుస్తాయ‌ట‌. ఒకేవ‌య‌సు వారినో లేదంటే వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద‌ది అయిన మ‌హిళ‌ల‌నో వివాహం చేసుకుంటే వారి ఆలోచ‌న‌లు క‌ల‌వ‌క‌పోవ‌డంతో అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌.

ALSO READ : జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

Visitors Are Also Reading