ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ గురించే చర్చ సాగుతోంది. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు,సినీ ఇండస్ట్రీ పెద్దలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న తరుణంలో కొంతమంది మాత్రం ఈ అవార్డును విమర్శిస్తూ డబ్బులు పెట్టి కొన్నారని న్యూస్ వైరల్ చేస్తున్నారు.. అలాంటి వారికి ఇది చెంపపెట్టు న్యూస్ అని చెప్పవచ్చు.. ఆస్కార్ అవార్డు కోసం అమీర్ ఖాన్ 2002లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం లగాన్ సినిమా కోసం అమీర్ ఖాన్ ఆస్కార్ సంపాదించాలని తీవ్రంగా కష్టపడ్డారు.
Advertisement
Also Read;మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి పాన్ ఇండియా స్టార్.. ఎవరంటే..?
ఒక్కమాటలో చెప్పాలంటే రెండు బిలియన్ డాలర్ కి పైగా వెచ్చించి మరీ ఓడిపోయి తిరిగివచ్చారు. రెండు బిలియన్ డాలర్లు అంటే 20 లక్షల పైగానే. రెండు దశాబ్దల క్రితం అంత ఖర్చు పెట్టి అవార్డు రాకపోవడం వెనుక కారణం ఏమైనా ఉండొచ్చు కానీ అతడు చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం సినిమాకి వెళ్లినంత వరకు ఎక్కువ మంది జ్యూరీ నెంబర్స్ కి చూపించడానికి అమెరికాను లాస్ ఏంజిల్స్ కి వెళ్లారు. అలా వెళ్లి ప్రతి ఒక్కరికి చూపించాలనుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా విజయం సాధిస్తాననే నమ్మకంతో ఆ పని చేశాను. కానీ అవార్డు రాలేదని అన్నారు.
Advertisement
Also Read;లిక్కర్ కేసులో ఈడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కల్వకుంట్ల కవిత?
ఇక ఖరీదైన హోటళ్లలో జ్యురీ నెంబర్స్ కు విందులు ఇవ్వాలి. ప్రమోషన్స్ చేయాలని అభ్యర్థించాలి. ఖరీదైన హోటల్లో పార్టీలు అంటే ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఉంటారో ఆలోచించవచ్చు. అంత పెట్టినా ఆస్కార్ రాలేదు అంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఉన్న అమీర్ ఖాన్ అవార్డు తీసుకురాక లేకపోవడం వెనక కారణమేంటో తెలియదు.కానీ అప్పట్లో మెయిన్ పేపర్స్ లాగానే సినిమా గురించి ప్రకటనలు ఇచ్చేవారట. ఇలా పట్టణంలోనే కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టారట అమీర్ ఖాన్. అయితే ఒక అవార్డు రావడానికి ఇంత కష్టం ఉంటుందని తెలియక కొంతమంది నాటు నాటు పాటకు ఖర్చుపెట్టి అవార్డు తెచ్చుకున్నారని అనడం చాలా దారుణం. అలాంటి అవివేకులు ఇలాంటి విషయాలు తెలుసుకొని మాట్లాడాలని కొంతమంది జ్ఞానం కలిగిన వ్యక్తులు అంటున్నారు.
Also Read;“మగధీర”కు మొదట అనుకున్న స్టార్ ఎవరో తెలుసా…?